Dhanush : ధనుష్, శృతి హాసన్ మూవీ రీ రిలీజ్ అవుతోంది
విమర్శకుల నుంచి విపరీతమైన ప్రశంసలు అందుకున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘3’. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ హార్ట్ మెల్టింగ్ లవ్ స్టోరీకి అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాలేదు కానీ.. ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ మూవీ టైమ్ లో ధనుష్ కు ఇక్కడ ఫాలోయింగ్ లేదు. శృతి హాసన్ కు పెద్ద ఫేమ్ లేదు. అయినా ఆడియన్స్ లోకి వెళ్లిందంటే కారణం అందరికీ తెలుసు.. ‘వై దిస్ కొలవెరీ డి’ అనే సాంగ్. ఈ పాట అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ తెచ్చుకుంది.ఆ క్రేజ్ తోనే తెలుగులో ఓపెనింగ్స్ వచ్చాయి. ‘3’మూకీ అవార్డుల పంట పండింది. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ మ్యూజీషియన్ గా ఉన్న అనిరుధ్ కు సంగీత దర్శకుడుగా పరిచయం అయిన సినిమా ఇదే కావడం విశేషం.
ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ఎలా చూసినా ఓ కొత్త రైటింగ్ ఇది. కానీ అప్పుడు ఆడియన్స్ కు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు. కొంత గ్యాప్ తర్వాత చూసిన వాళ్లు.. అరే.. ఇదో మాస్టర్ పీస్ లాంటి మూవీ కదా అనుకున్నారు. థియేటర్స్ మిస్ అయిన వాళ్లు చాలా ఫీల్ అయ్యారు కూడా. అలాంటి వారి కోసమే ‘3’ చిత్రాన్ని ఈ నెల 14న తెలుగులో ‘3’రీ రిలీజ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com