5 Years of Goodachari: 'G2' ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవుతుంది : అడివి శేష్

5 Years of Goodachari: G2 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవుతుంది : అడివి శేష్
X
'గూఢచారి'కి ఐదేళ్లు.. గ్రాటిట్యూడ్ నోట్ షేర్ చేసిన అడివి శేష్

ప్రముఖ నటుడు అడివి శేష్ 'గూఢచారి' బ్లాక్ బస్టర్ విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, శేష్ కృతజ్ఞతా పత్రాన్ని పోస్ట్ చేశాడు. 2018లో వచ్చిన ఈ చిత్రం సీక్వెల్ G2.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని ప్రకటించాడు. దాంతో పాటు 'గూఢచారి'పై అభిమానులు కురిపించిన ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. G2.. భారీ స్థాయిలో బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. “దక్షిణ భారత సినిమాకు గూఢచారి శైలిని అందించింది ఈ చిత్రం. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఈ సినిమా... ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమాపై, మాపై చాలా ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఇది ఫ్రాంచైజీపై మరింత బాధ్యతను పెంచుతుంది. భారీ స్థాయిలో బ్లాక్‌బస్టర్ యాక్షన్ స్పెక్టాకిల్‌ను అందించడానికి మేము చాలా కష్టపడుతున్నాము" అని అడివి శేష్ రాసుకువచ్చాడు.

“మీకు థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్‌ట్రావాగాంజా ఇవ్వడమే కాదు.. ఇది మీకు అంచనాలకు మించి G2ని తీసుకురావడమే మా లక్ష్యం. G2 కేవలం జాతీయ స్థాయిలోనే కాదు .. అంతర్జాతీయ సిినిమా కూడా అవుతుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు దేశాల్లో ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలో సెట్స్‌కి వెళ్లేందుకు రెడీగా ఉంది. ఏజెంట్ 116 డ్యూటీ కోసం రిపోర్ట్ చేస్తారు" అని అడివి శేష్ చెప్పారు.

ఇక దర్శకుడు శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన 'గూఢచారి' ఒక యువ గూఢచారి చుట్టూ తిరుగుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, గూఢచారి విడుదలైన రోజునే, అడివి శేష్ సన్నిహితుడు, జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత రాహుల్ రవీంద్రన్ 'చిలసౌ' కూడా తెరపైకి వచ్చింది. రెండు సినిమాల మధ్య జరిగిన పోటీని గుర్తు చేస్తూ రాహుల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అతని ఫన్నీ ట్వీట్ ఇటీవలి 'బార్బీ', 'ఓపెన్‌హైమర్' బాక్సాఫీస్ క్లాష్ ను కూడా ప్రస్తావించింది.

రాహుల్ ట్వీట్ చేస్తూ, “5ఏళ్ల క్రితం TFIలో గూలాసోవ్ లో జరిగిన ఓ పెదవాడి వెర్షనే బార్బెన్‌హైమర్. మేము ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రేమను పొందుతూనే ఉన్నాము. నిజంగా కృతజ్ఞతలు మీరు ఇంకా ఈ చిత్రాలను ప్రైమ్, సన్‌ఎక్స్‌టిలో చూడకపోతే…” అని రాసుకువచ్చారు. ఇక జీ2 చిత్రం విషయానికొస్తే నూతన దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags

Next Story