69th National Film Awards 2023: 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు
69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగోడు సత్తా చాటాడు.. 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ను బెస్ట్ హీరో అవార్డు వరించింది. ఉత్తమ నటిగా అలియా భట్‌కు గంగుభాయి కతియా వాడి సినిమాకి అవార్డు వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్, ఉత్తమ గాయకుడిగా కాలభైరవ, ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణికి అవార్డులు దక్కాయి. మరోవైపు పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడుతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో తెలుగు నుంచి ఉప్పెనకు..ఉత్తమ గీత రచయితగా కొండపొలం చిత్రానికి చంద్రబోస్‌కు అవార్డు వచ్చింది. తెలుగు నుంచి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ విభాగంలో పురుషోత్తమాచార్యులకు అవార్డ్ దక్కింది. 2021 ఏడాదికి గాను మొత్తం 24 కేటగిరీల్లో జాతీయ అవార్డులు ప్రకటించారు.
69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన
69వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగోడి సత్తా
69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకు నేషనల్ అవార్డు
పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌కు బెస్ట్ హీరో అవార్డు
ఉత్తమ నటిగా అలియా భట్‌కు అవార్డు
ట్రిపుల్ ఆర్ సినిమాకు అవార్డుల పంట
ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్
ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్
ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి
ఉత్తమ సంగీత దర్శకుడు (పుష్ప) దేవీశ్రీ ప్రసాద్
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన
ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ (కొండపొలం)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ (తెలుగు) అవార్డ్ పురుషోత్తమాచార్యులు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com