Naga Chaitanya : నాగ చైతన్య పై 75 కోట్లు.. ఏ ధైర్యంతో పెడుతున్నారో

Naga Chaitanya : నాగ చైతన్య పై 75 కోట్లు.. ఏ ధైర్యంతో పెడుతున్నారో
X
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇప్పటి వరకూ సరైన ఇమేజ్ తో సెట్ కాలేదు. లవర్ బాయ్ నుంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ను దాటి మాస్ హీరోగానూ ప్రయత్నించి అన్నిటిలోనూ ఒక్కో హిట్ చూశాడు తప్ప ఎందులో ఫిట్ అవుతాడు అనేది మాత్రం ఇంకా తేలలేదు అనే చెప్పాలి. పైగా అతని మార్కెట్ రేంజ్ కూడా పెరగలేదు. ఇప్పటి వరకూ ఓ ముఫ్ఫై కోట్ల సినిమా సోలోగా లేదు. అలాంటి హీరోపై ఏకంగా 75 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే నిర్మాతల ధైర్యం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా తండేల్ సినిమా గురించి.

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇప్పటి వరకూ సరైన ఇమేజ్ తో సెట్ కాలేదు. లవర్ బాయ్ నుంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ను దాటి మాస్ హీరోగానూ ప్రయత్నించి అన్నిటిలోనూ ఒక్కో హిట్ చూశాడు తప్ప ఎందులో ఫిట్ అవుతాడు అనేది మాత్రం ఇంకా తేలలేదు అనే చెప్పాలి. పైగా అతని మార్కెట్ రేంజ్ కూడా పెరగలేదు. ఇప్పటి వరకూ ఓ ముఫ్ఫై కోట్ల సినిమా సోలోగా లేదు. అలాంటి హీరోపై ఏకంగా 75 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే నిర్మాతల ధైర్యం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా తండేల్ సినిమా గురించి. చందు మొండేటి తెరకెక్కిస్తోన్న బడ్జెట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఏ లెక్కలూ వేసుకోకుండానే ఓ మీడియం రేంజ్ హీరోపై అంత బడ్జెట్ పెట్టరు కదా. పైగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నది గీతా ఆర్ట్స్ వాళ్లు. ఈ బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మిస్తున్నాడీ సినిమాను. గీతా బ్యానర్ వాళ్ల లెక్కలు చూస్తే ఈ బడ్జెట్ భారం కేవలం నాగ చైతన్య ఒక్కడే మోయాల్సిన అవసరం లేదు అని అర్థం అవుతుంది.

చందు మొండేటి ఇంతకు ముందు కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు. ఆ మూవీలోని శ్రీ కృష్ణుడి ఫిలాసఫీకి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే కార్తికేయ 2 వంద కోట్లు సాధించింది. తండేల్ ను కూడా ప్యాన్ ఇండియా సినిమాగానే రిలీజ్ చేయబోతున్నారు. సో కార్తికేయ 2 దర్శకుడి సినిమాగా మొదటి ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. ఇక సాయి పల్లవి కూడా ఉంది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ కు ఆమెకు సంబంధించిన ఒక్క లుక్ విడుదలైనా చాలు. కలిసొస్తుంది.

వీటికి మించి తండేల్ చాలా భాగం పాకిస్తాన్ లో సాగుతుంది. శ్రీకాకుళం నుంచి చేపల వేటకు వెళ్లి పొరపాటున పాకిస్తాన్ నేవీకి చిక్కి అక్కడి నుంచి పాక్ జైల్లో కొంతకాలం ఉండి.. మన దేశ జోక్యంతో వాళ్లు తీవ్రవాదులు కాదు అని తెలుసుకున్న తర్వాత విడుదలవుతారు. మామూలుగా అయితే ఇదో ఎమోషనల్ స్టోరీ. కానీ వీళ్లు దీనికి దేశ భక్తిని జోడిస్తున్నారు. సినిమా ప్రారంభంలోనే వదిలిన గ్లింప్స్ లో భారత్ మాతాకీ జై అని డైలాగ్ పెట్టారు. అది చాలు.. పాక్ ను తిడుతూ అక్కడి వారిపై హీరో తిరగబడే సీన్స్ ఎలాగూ ఉంటాయి. ఇవన్నీ కలిసొస్తాయనే నమ్మకంతోనే వీళ్లు అంత భారీ బడ్జెట్ ను నాగచైతన్యపై పెడుతున్నారు. ఈ అంశాలన్నీ తండేల్ కు కలిసొచ్చేవే. సో.. అన్నీ కుదిరి ఈ మూవీ వంద కోట్లు కొడితే ఏ సాహసం లేకుండా నాగ చైతన్య వంద కోట్ల హీరో అవుతాడు. అదీ మేటర్.

Tags

Next Story