96 Tamil movie ఈ క్లాసిక్ కు రీమేక్ అవసరమా

96 Tamil movie  ఈ క్లాసిక్ కు రీమేక్ అవసరమా

ఓ క్లాసిక్ మూవీని చెడగొట్టాలంటే ఏం చేయాలి..? వెరీ సింపుల్.. ఈ మూవీకి సీక్వెల్ చేయాలి.. లేదంటే వేరే భాషలో రీమేక్ చేయాలి. ఈ విషయంలో ఆల్రెడీ రీమేక్ తో లాస్ అయ్యాడు దర్శకుడు. అయినా సీక్వెల్ కూడా తీస్తానంటున్నాడు. మరి ఈ మూవీ ఏంటో తెలుసు కదా.. యస్.. ‘96’. ప్రేమ్ కుమార్ సి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. చూసిన వాళ్లంతా క్లాసిక్ అన్నారు. హార్ట్ మెల్టింగ్ లవ్ స్టోరీ అన్నారు. ప్రతి ఒక్కరి టీనేజ్ లవ్ స్టోరీని మరోసారి గుర్తు చేశాడు దర్శకుడు. అందుకే ఎక్కువమందికి కనెక్ట్ అయింది. ముఖ్యంగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్లంతా తమను తాము చూస్తున్నారీ కథలో.

ఇదే చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంత జంటగా అదే దర్శకుడు జాను అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. బట్ మనవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆల్రెడీ 96నే చాలామంది చూసి ఉండటం ఓ కారణమైతే.. చూడని వాళ్లకు స్లో నెరేషన్ ఎక్కలేదు. దీంతో సినిమా పోయింది. అయినా తమిళ్ తో పాటు తెలుగులోనూ 96ను క్లాసిక్ అని ఫీలయ్యే వాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి మూవీకి సీక్వెల్ చేస్తా అంటున్నాడు దర్శకుడు. ఇది మంచి ఆలోచనా కాదా అనేది పక్కన బెడితే ఆ పాయింట్ ను ఎలా కన్వే చేస్తాడు. హీరో మనసు నిండా హీరోయిన్ ఉంది. అతనికి బలవంతంగా పెళ్లి చేస్తేనో లేక హీరోయిన్ తన భర్తను వదిలేసి రావడమో నెక్ట్స్ పార్ట్ కు ముడి సరుకు అవుతుంది. లేదంటే ఇంకెలా తీసినా 96 ఫీల్ రాదు. సో.. ఇదంతా ప్రమోషనల్ స్టంట్ లో భాగంగానే తప్ప నిజంగా సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శకుడిలో కూడా లేదు అనేది వాస్తవం.

ఇంతకీ ఈ సీక్వెల్ సందర్భం ఏంటంటే.. ప్రస్తుతం ఈ దర్శకుడు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు చేస్తుండగా తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించింది. ఈ నెల 27న దేవరకు పోటీగా విడుదల చేయబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లోనే 96 సీక్వెల్ గురించి చెప్పాడు దర్శకుడు. సో.. ఇది ప్రమోషనల్ స్టంట్ అనిపించడం లేదూ..?

Tags

Next Story