Ilayaraja : ఇళయరాజా, కీరవాణి.. ఏ జన్మలోదో ఈ పరిచయం

Ilayaraja  :  ఇళయరాజా, కీరవాణి.. ఏ జన్మలోదో ఈ పరిచయం
X

కొన్ని కాంబినేషన్స్ భలే క్రేజీగా ఉంటాయి. ఇళయరాజా అంటే ఇండియన్ సినిమా మ్యూజిక్ కు ముఖచిత్రం లాంటి వాడు. కీరవాణి అందులో ఓ స్పెషల్ స్టోరీ లాంటి వాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ పాట వచ్చిందంటే ఎలా ఉంటుంది..? అంటే ఇదుగో ఇలా ఉంటుంది అంటూ వచ్చిందీ పాట. షష్టిపూర్తి అనే చిత్రం నుంచి విడుదలైన ఈ సాంగ్ రెట్రో టైమ్ రాజాను గుర్తుకు చేస్తే కీరవాణిని కూడా అదే స్థాయి రైటర్ ను గుర్తుకు చేస్తోంది. యస్.. ఈ పాటను రాసింది కీరవాణి అయితే.. స్వరపరిచింది ఇళయరాజా. కాస్త వింతగా ఉన్న ఈ కాంబోలోని పాట ఓ బ్యూటీఫుల్ మెలోడీలా వినిపిస్తోంది. మంచి సాహిత్యం కూడా ఉండటం విశేషం.

నిజానికి కీరవాణి గతంలోనూ చాలా పాటలే రాశాడు. కానీ అవన్నీ తను మ్యూజిక్ చేసిన పాటలే. ఇలా రాజా ట్యూన్ కు సాహిత్యం అందించడం మాత్రం ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. ఏదో నీ వల్ల నాదో ఈ పరవశం.. రాగం నీదై.. పల్లవి నాదై చరణం చరణం కలిసి వేళా.. ’అంటూ సాగే ఈ గీతం ఓ చేయి తిరిగిన రచయిత రాసినట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ అరుదైన కలయికలో వినిపించిన ఈ పాట సినిమాకే పెద్ద ఎసెట్ లా ఉండేలా ఉంది.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మించగా పవన్ ప్రభ డైరెక్ట్ చేశాడు. త్వరలోనే విడుదల కాబోతోందీ షష్టిపూర్తి. అన్నట్టు లేడీస్ టైలర్ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించిన సినిమా ఇదే కావడం విశేషం.

Tags

Next Story