SSMB : రాజమౌళి, మహేష్ మూవీపై బిగ్ అప్డేట్

SSMB :  రాజమౌళి, మహేష్ మూవీపై బిగ్ అప్డేట్
X

టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే మహేష్ బాబు, రాజమౌళిదే. వీరి కలయికలో సినిమా కోసం టాలీవుడ్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోంది. ఇప్పుడు అనుకోని వరంలాగా రాజమౌళి ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. అది సూపర్ స్టార్ కు సూపర్బ్ గా కలిసి రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అంతా అనుకున్నట్టుగా రెండు భాగాలుగా కాక ఒకే పార్ట్ తో ముగిసిపోయే కథ ఇది. ఇక ఆ మధ్య మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తన వద్దే ఉంచుకున్నా అని చెబుతూ రాజమౌళి పెట్టిన పోస్ట్ ఎంత వైరల్ అయిందో.. తాజాగా ఆ పాస్ పోర్ట్ తో వెకేషన్ కు వెళుతూ ఫోటోగ్రాఫర్స్ ను అది చూపించడం అంతే వైరల్ అయింది. సమ్మర్ కాబట్టి చిన్న గ్యాప్ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఈ గ్యాప్ లో మహేష్ ఎంజాయ్ చేస్తాడు కానీ జక్కన్న కాదు. ఆయన ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ కోసం రెడీ అవుతున్నాడు.

మామూలుగా రాజమౌళి మూవీస్ గ్రాంగ్ గా ఓపెనింగ్ జరుపుకుంటాయి. ఈ చిత్రాన్ని సైలెంట్ గా స్టార్ట్ చేశారు. ఎలాంటి మీడియా హడావిడీ లేకుండా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ వీడియోస్ ను కూడా విడుదల చేయలేదు. అందుకే సినిమాకు సంబంధించి ఓ పర్ఫెక్ట్ వీడియో కట్ తో అనౌన్స్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ అయిన షూటింగ్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మహేష్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ షూటింగ్ నుంచి సినిమా థీమ్ ఎలివేట్ అయ్యేలా ఓ వీడియోను విడుదల చేస్తూ మీడియాతో పాటు సినిమా సర్కిల్స్ లోనూ తానేం చేయబోతున్నాడో ఇన్ డైరెక్ట్ గా చెప్పబోతున్నాడు అంటున్నారు. మరి ఇది ఏ మేరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది. బట్.. ఈ తరహా అనౌన్స్ మెంట్ అయితే కచ్చితంగా ఉందనేది మాత్రం తెలుస్తోంది.

Tags

Next Story