Siddu Jonnalagadda : ఈ జాక్ టిల్లు ను దాటేస్తాడా

Siddu Jonnalagadda  :  ఈ జాక్ టిల్లు ను దాటేస్తాడా
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన జాక్ మూవీ ఈ గురువారం విడుదల కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ తో మిక్స్ డ్ టాక్ వినిపించింది. అయితే సిద్ధు అంతకు ముందు చేసిన డిజే టిల్లు, డిజే టిల్లు స్క్వేర్ చిత్రాల రిజల్ట్స్ ఈ మూవీకి పాజిటివ్ గా మారాయి అనేది వాస్తవం. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో అతను ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడం వల్ల కొంత నెగెటివ్ సైడ్ కనిపిస్తోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో సిద్ధు తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నారు చాలామంది. బట్ అలాంటిదేం ఉండదని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన నాగవంశీ చెప్పడంతో ఇది డిజే టిల్లుకు కొనసాగింపు లాంటి పాత్రగానే ఉండబోతోందని అనుకోవచ్చు.

నిజానికి ఒక సినిమా ఇమేజ్ ను వేరే కథల్లోనూ కంటిన్యూ చేయడం అంత మంచిదేం కాదు. ఆ ధోరణి నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటనే ఆ నటుడులోని వెర్సటాలిటీ ఆడియన్స్ కు తెలుస్తుంది. లేదంటా చాలా త్వరగానే మొనాటనీ వస్తుంది. నిజానికి సిద్ధు జొన్నలగడ్డ సినిమాలు చూస్తే కథలను బట్టి కూడా అతని డైలాగ్ మాడ్యులేషన్ కనిపిస్తుంది. అలాగ జాక్ కథ కూడా డిజే టిల్లు తరహా మాడ్యులేషన్ ను డిమాండ్ చేసిందా లేక కలిసొచ్చిందని మనోడే కంటిన్యూ చేస్తున్నాడా అనేది తెలియదు కానీ.. ఈ మూవీతో అతని ముందు ఓ సవాల్ కూడా ఉంది. ఫస్ట్ టైమ్ ఇండియన్ ఏజెంట్ గా నటించాడు. ఇలాంటి పాత్రల్లోనూ మెప్పిస్తాడు అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. మరి సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

Tags

Next Story