Allu Arjun Arrest : అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా మృతి చెందిన రేవతి అనే మహిళ మరణానికి కారణమైన వారిలో ఒకరుగా భావిస్తూ.. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ లు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్ట్ లో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ ను విధించింది కోర్ట్. దీంతో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ అల్లు అర్జున్ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ వైపు న్యాయవాదులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. అయితే ఈ కేస్ లో అల్లు అర్జున్ పై పెట్టి 118 సెక్షన్ ఆయనకు వర్తించదు. అలాగే 105 సెక్షన్ కూడా వర్తించదు. ఈ సెక్షన్ వర్తించాలంటే మారణాయుధాలు ఉండాలి.. ఉద్దేశ్యపూర్వకంగా చేసే చర్య అవుతుంది తప్ప.. అల్లు అర్జున్ కు వర్తించదు అని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది చేసిన వాదనతో హై కోర్ట్ జడ్జ్ ఏకీభవించారు.
అలాగే ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీ లో ఉన్నారు. ఘటన లోయర్ బాల్కనీ లో ఉంది కాబట్టి ఇది ఆయనకు సంబంధించింది కాదు అన్నారు. అటు పోలీస్ ల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వస్తున్నట్టు సమాచారం ఇచ్చాడు కానీ.. ఆయనకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి.. ఆయన రావడం తప్పు అనేది పోలీస్ వాదన. ఈ రెండు వాదనలూ పరిశీలించిన హై కోర్ట్ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
నిజానికి ఈ కేస్ లో అల్లు అర్జున్ తో పాటు ఇతరులపై పోలీస్ లు నమోదు చేసిన బిఎన్ఎస్ 105 సెక్షన్ వర్తించదు అనేది చాలామంది న్యాయవాదులు చెబుతున్నారు. ఈ సెక్షన్ ప్రకారం అది దోషపూరితమైన హత్యకు ఆపాదించే సెక్షన్ గా చెబుతున్నారు. కల్పబుల్ హోమిసైడ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.. ఉన్నా పోలీస్ లు వాటిని సేకరించలేకపోయారు.. అనేది అంతా చెబుతున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ తో భారీ ఊరట లభించిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com