Pushpa 2 : పుష్ప 2 నిర్మాతలకు హై కోర్టు లో ఊరట..

Pushpa 2 :  పుష్ప 2  నిర్మాతలకు హై కోర్టు లో ఊరట..
X

సంధ్య థియేటర్ ఘటనలో పుష్ప 2 నిర్మాతలైన రవి శంకర్, నవీన్ లపైనా పోలీస్ లు కేస్ నమోదు చేశారు. వీరిని ఏ 17గా చేర్చుతూ కేస్ నమోదు చేశారు. అయితే తమపై నమోదైన ఈ కేస్ ను కొట్టివేయాలని కోరుతూ.. నిర్మాతలు కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా తమ బాధ్యతగా నిర్మాతలు ముందుగానే పోలీస్ లకు సమాచారం ఇచ్చామన్నారు. తాము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే అంతమంది పోలీస్ లు సంధ్య థియేటర్ వద్దకు వచ్చారని న్యాయవాది కోర్ట్ కు తెలిపాడు. అన్ని చర్యలూ తీసుకున్నా కూడా అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందనీ.. ఆ ఘటనకు సినిమా నిర్మాతలను ఎలా బాధ్యులుగా చేరుస్తారని న్యాయవాది ప్రశ్నించాడు.

దీంతో నిర్మాతల తరఫు లాయర్ వాదనను సమర్థించిన హై కోర్ట్ తదుపతి ఉత్తర్వులు వచ్చే వరకూ నిర్మాతలను అరెస్ట్ చేయొద్దని పోలీస్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేస్ తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

మొత్తంగా ఒకే రోజు తెలంగాణ పోలీస్ లకు రెండు షాక్ లు తగిలాయి. జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ పోలీస్ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పాలని డిజిపికి ఆదేశాలిచ్చింది. ఇప్పుడు నిర్మాతల విషయంలో హై కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Tags

Next Story