Mahesh Babu : మహేష్ బాబుపై మరో రూమర్

Mahesh Babu :  మహేష్ బాబుపై మరో రూమర్
X

స్టార్ హీరోలపై రూమర్స్ కామన్ గా కనిపిస్తుంటాయి. అవి వారి ఇమేజ్ కు తగ్గట్టుగా, హుందాగా ఉంటే వాళ్లూ హ్యాపీగానే ఫీలవుతారు. లేదంటేనే చిరాకు పడతారు. టాప్ హీరోలైతే అసల రూమర్స్ ను పట్టించుకోను కూడా పట్టించుకోరు. ఇలా మహేష్ బాబు కూడా లైట్ తీసుకుంటాడు. బట్ ఈ రూమర్ నిజమైతే బావుండు అనేవి కొన్ని ఉంటాయి. ఇది కూడా అలాంటిదే.

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఇదో కొత్త తరహా కథగా చెబుతున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోందని ముందే చెప్పారు. ఇందుకోసం ఆఫ్రికల్ అడవుల్లో లొకేషన్స్ సెర్చ్ చేస్తూ కనిపిస్తోన్న రాజమౌళి వీడియో కూడా వైరల్ అవుతోందిప్పుడు. ఫస్ట్ టైమ్ సెట్ అయిన ఈ క్రేజీ కాంబోలో మూవీ కోసం ఎంటైర్ కంట్రీ వెయిట్ చేస్తోంది. ఖచ్చితంగా కంట్రీ రికార్డులన్నీ బద్ధలు కొట్టే సినిమా అవుతుందనే అంచనాలున్నాయి.

ఇంతకీ మహేష్ బాబుపై వచ్చిన రూమర్ ఏంటా అనుకుంటున్నారు కదా. సూపర్ స్టార్ ఓ సినిమాలో శ్రీ కృష్ణుడుగా కనిపించబోతున్నాడని. యస్.. కాకపోతే వినడానికి చాలా బావున్న ఈ మాట నిజం కాదు. ఆ సినిమా దేవకి నందన వాసుదేవ. మహేష్ బాబుకు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన సినిమా ఇది. ఇందులోనే ఆయన కృష్ణుడుగా ఓ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడనే రూమర్ వచ్చింది. బట్ ఇందులో నిజం లేదు. అంతా పుకారే అని తేల్చేశారు. అయినా ఈ పుకారు కూడా వినడానికి బావుంది కదా.

Tags

Next Story