Ashok Galla : దేవకి నందన వాసుదేవ ట్రైలర్ .. సూపర్

Ashok Galla :  దేవకి నందన వాసుదేవ ట్రైలర్ .. సూపర్
X

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బట్ ఇంకా సక్సెస్ ను అందుకోలేదు. ఆ విజయం కోసం ఈ సారి ‘దేవకి నందన వాసదేవ’ అంటూ వస్తున్నాడు. ఈ చిత్రానికి హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. చాలాకాలంగా చిత్రీకరణ జరుకున్న ఈ మూవీని ఈ 14న విడుదల చేయాలనుకున్నారు. కంగువా, మట్కాతో పోటీ ఎందుకని 22కి పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఇండియాలో చాలా కథలు మన పౌరాణికాలను ఆధారం చేసుకునే రూపొందుతున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే భాగవతం నుంచి శ్రీ కృష్ణుడి కథను సోషలైజ్ చేశారు అనిపించేలా ఉంది. అక్కడక్కడా మహేష్ బాబు మురారిని తలపించినా.. ఓవరాల్ గా చూస్తే ‘వావ్’అనిపించే కంటెంట్ తో వస్తున్నారని అర్థం అవుతుంది. భాగవతంలో శ్రీ కృష్ణుడి మేనమామ కంసుడికి అతని మరణం చెల్లి కొడుకు ద్వారా ఉందని తెలుసుకుని.. చెల్లిని బావను తన కారాగారంలో బంధిస్తాడు. మగపిల్లలు పుడితే వారిని చంపేస్తుంటాడు. ఈ కథ దానినే గుర్తు చేస్తుంది. మేనల్లుడి చేతిలోనే తన మరణం ఉందని తెలుసుకున్న విలన్ అతన్ని అంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ విషయం హీరోకు తెలియదు. అనుకోకుండా మేనమామ కూతురునే ప్రేమిస్తాడు. అయితే ఇతను కృష్ణుడులా కూల్ కాదు. చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంటాడు. తనకు మరణ గండం ఉందని తల్లి చెప్పినా వినిపించుకోడు. ఆ క్రమంలో అతను మేనమామను ఢీ కొంటాడు. కౄరమైన రాక్షస స్వభావం ఉన్న అతని మేనమామను ఇతను ఎలా అంతం చేస్తాడు అనేది అసలు కథ.

ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. పౌరాణికాన్ని ఇంత సింపుల్ గా సోషలైజ్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ఇది పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కథ అందిస్తే సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు. అర్జున్ జంధ్యాల స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశాడు. నిజానికి ఈ కథను ప్రశాంత్ వర్మే డైరెక్ట్ చేయాలి. అతని ప్యాన్ ఇండియా మూవీస్ కమిట్మెంట్ వల్ల కుదర్లేదు. అందుకే అర్జున్ కు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చాడు.

ఇక దేవకి నందన వాసుదేవలో అశోక్ గల్లా సరసన మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. మొత్తంగా ఓ బ్లాక్ బస్టర్ లుక్ తో కనిపిస్తోందీ ట్రైలర్. ప్రాపర్ ప్రమోషన్స్ తో ప్లాన్ చేసుకుంటే అశోక్ కు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయీ ట్రైలర్ లో. కాకపోతే ట్రైలర్ లో ఉన్న స్టఫ్ సినిమాల్లో కనిపించడం లేదీ మధ్య. అందుకు ఈ మూవీ మినహాయింపులా కనిపిస్తోంది. సినిమాలో బలమైన కథనం ఉండేలా ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story