Mahesh Babu : మహేష్ కు భలే విలన్ ను సెట్ చేశారే..

Mahesh Babu :  మహేష్ కు భలే విలన్ ను సెట్ చేశారే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా అఫీషియల్ గా రావడం లేదు. ఆ మధ్య ఓపెనింగ్ సెరెమనీ జరిగింది. మరి షూటింగ్ కూడా స్టార్ట్ అయిందా అంటే ఎవరూ కన్ఫార్మ్ గా చెప్పడం లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉందో కూడా తెలియడం లేదు. ఆ రేంజ్ లో సీక్రెట్స్ మెయిన్టేన్ చేస్తున్నాడు రాజమౌళి. ప్రియాంక చోప్రా హీరోయిన్ అన్నారు. ఆమె హైదరాబాద్ వచ్చింది. గుళ్లూ గోపురాలూ తిరిగింది. మహేష్, రాజమౌళి ట్విట్టర్ కన్వర్జేషన్ లో దూరింది. దీంతో తను ఈ ప్రాజెక్ట్ లో ఉందని ఫిక్స్ అయ్యారు. మరి హీరోయిన్ తనేనాల లేక మరో ఫీమేల్ కూడా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇక తాజాగా ఈ సినిమాలో విలన్ అంటూ బాలీవుడ్ స్టార్ జాన్అబ్రహాం పేరు వినిపిస్తోంది. జాన్ ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు. రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ లో ఉన్నాడు. కానీ హీరోగా, విలన్ గా స్టార్డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు. బట్ అతని విలనీ బావుంటుంది. ఇటు మహేష్ తో మంచి మ్యాచ్ అవుతుంది. ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి సీన్స్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఇటు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం కలిసి బాలీవుడ్ లో దోస్తానా అనే సినిమాలో నటించి ఉన్నారు. ముగ్గురి మధ్య మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయంటున్నారు.

కాకపోతే అన్ని వార్తల్లానే ఈ జాన్ అబ్రహాంకు సంబంధించిన న్యూస్ ను కూడా ఇంకా కన్ఫార్మ్ చేయలేదు మేకర్స్.

Tags

Next Story