Bellamkonda Sai Srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ పై కేస్ నమోదు

రైజింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై పోలీస్ కేస్ నమోదైంది. రెండు రోజుల క్రితం అతను తన కార్ లో స్వయంగా డ్రైవ్ చేస్తూ రాంగ్ రూట్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కార్ తో ఢీ కొట్టాడు. రాంగ్ రూట్ లో రావొద్దు అన్న కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించాడు కూడా. ఇదంతా అక్కడే ఉన్న కొందరు వీడియోలో బంధించారు. అది కాస్తా వైరల్ కావడంతో కామన్ పీపుల్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఓ కామన్ మేన్ ఇలా చేస్తే పోలీస్ లు ఊరుకుంటారా..? సెలబ్రిటీ అనే కదా లైట్ తీసుకున్నారు అంటూ కామెంట్స్ మొదలుపెట్టారు. వీటిని పరిగణలోకి తీసుకున్న పోలీస్ లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సాయిశ్రీనివాస్ పై కేస్ నమోదు చేశారు.
ప్రస్తుతం అతను నటించిన భైరవం మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఆ తర్వాత టైసన్ నాయుడు, హైందవం, కిష్కింద పురి వంటి మూవీస్ రాబోతున్నాయి. చూస్తుంటే మంచి లైనప్ కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో లేనిపోని ఇష్యూస్ తెచ్చుకోవడం వ్యక్తిగతం కూడా ఇబ్బంది అవుతుంది. కాస్త దుడుకుతనం తగ్గించుకుంటే మంచిదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com