Siddharth: సిద్ధార్థ్‌పై కేసు నమోదు.. అసభ్యకర మెసేజ్‌లు చేస్తున్నాడంటూ..

Siddharth (tv5news.in)
Siddharth: కొంతమంది కాంట్రవర్సీలు సృష్టించడంలో దిట్ట. కానీ కొందరు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. ఈ రెండిటిలో ఏ కోవకు చెందినవాడో తెలియదు కానీ.. హీరో సిద్ధార్థ్ చుట్టూ ఎప్పుడూ కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉంటాయి. మన దేశంలో ప్రతీ ఒక్కరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కానీ ఆ ఫ్రీడమ్‌ను ఎక్కువగా ఉపయోగించి సిద్ధార్థ్ చిక్కుల్లో పడుతుంటాడు. తాజాగా దీని వల్లే ఈ హీరోపై కేసు నమోదయ్యింది.
కొన్ని రోజుల క్రితం ఓ హీరోయిన్ విడాకుల విషయంలో కూడా సిద్ధార్థ్ ఒక ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. దానిపై సిద్ధార్థ్ స్పష్టత కూడా ఇచ్చాడు. తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని, మామూలుగా చేస్తే.. నెటిజన్లు అలా అనుకుంటున్నారని అన్నాడు. కానీ నిజమేంటో అందరికీ తెలుసు. తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై చేసిన ట్వీట్ అంతకంటే ఎక్కువ దుమారాన్నే రేపింది.
సైనాపై చేసిన ట్వీట్ విషయంలో ఇంకా మహిళా సంఘాలు సిద్ధార్థ్‌పై కోపంగా ఉన్నాయి. ఇంతలోనే తనపై మరో వివాదం మొదలయ్యింది. ట్విటర్‌లో తనకు అసభ్యకర మేసేజ్‌లు చేస్తున్నాడంటూ ఓ మహిళ సిద్ధార్థ్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. తన దుడుకుతనంతో సిద్ధార్థ్ ఇప్పటికీ చిక్కుల్లో పడుతున్నాడంటూ చాలామంది నెటిజన్లు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com