Coolie : హాట్ టాపిక్ గా మారిన కూలీకి ‘ఏ’సర్టిఫికెట్

కోలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన కూలీ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇదే ఆ హాట్ టాపిక్ కు కారణం. ఇందులో వింతేముందీ అనుకుంటున్నారా..? వింత లేదు కానీ ఓ రికార్డ్ ఉంది. రజినీకాంత్ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం 36యేళ్ల తర్వాత ఇదే కావడం, లోకేష్ ఇప్పటి వరకూ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఫస్ట్ టైమ్ ఏ సర్టిఫికెట్ ఈ చిత్రానికే రావడం.. ఈ రెండే కోలీవుడ్ లో డిస్కషన్స్ కు కారణమయ్యాయి. మామూలుగా లోకేష్ మూవీలో ఇంటిమేట్ సీన్స్ ఉండవు. ఆడవాళ్లతో స్కిన్ షో కనిపించదు. కేవలం యాక్షన్ కే యూ/ఏ వస్తుంది. బట్ ఈ మూవీలో ప్రాపర్ హీరోయిన్ కూడా లేదు. అయినా ‘ఏ’ సర్టిఫికెట్ ఏంటీ అనేది చాలామంది ఆశ్చర్యానికి కారణం అవుతుంది. చూస్తుంటే రజినీకాంత్ పూర్తిగా లోకేష్ కనకరాజ్ విజన్ కు సరెండర్ అయినట్టున్నాడు. అతను ఏం చెప్పినా చేసినట్టు ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్ పీపుల్. ఈ విషయంలో అక్కడి సీనియర్ జర్నలిస్ట్ లు కూడా సోషల్ మీడియా వేదికగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో.. చూస్తోంటే.. ఈ సారి కూలీలో వయొలెన్స్ రేంజ్ డబుల్ చేసినట్టు ఉన్నాడు లోకి మామా అంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు.
ఇక ఈ నెల 14న విడుదల కాబోతోన్న కూలీలో రజినీకి విలన్ గా అక్కినేని నాగార్జున కనిపించబోతుండటం విశేషం. కన్నడ నుంచి ఉపేంద్ర, మళయాలం నుంచి సౌబిర్ షబిన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com