Sudheer Rashmi Relationship: సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరని రాసిస్తానంటున్న..
Sudheer Rashmi Relationship: బుల్లితెరపై కొన్ని జంటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందులో ఒకరే సుధీర్, రష్మీ.

Sudheer Rashmi Relationship: వెండితెరపై కొన్ని జంటలకు ఎంత క్రేజ్ ఉందో బుల్లితెరపై కూడా అలాంటి కొన్ని జంటలు ఉన్నాయి. అందులో ఒకరే సుధీర్, రష్మీ. దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఈ జంట బుల్లితెరపై అలరిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ వీరి పెయిర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే చాలు వీరు అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండాల్సిందే. వీరికి ఉన్న క్రేజ్‌తో వీరు కలిసి చేసిన షోలు కూడా బాగానే పాపులారిటీని సాధిస్తాయి. అయితే వీరిద్దరు నిజంగానే లవర్సా? లేక టీఆర్‌పీల కోసం అలా నటిస్తున్నారా అన్న అనుమానం చాలామందికి మొదటి నుండే ఉంది.
సుధీర్, రష్మీల కెమిస్ట్రీ చూస్తుంటే వారు రియల్ లైఫ్‌లో కూడా ప్రేమికులని, నిజంగానే పెళ్లి కూడా చేసుకుంటారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం అది కేవలం షో కోసమే అని కొట్టిపారేస్తుంటారు. తాజాగా వారితో పాటు కామెడీ షోలో పనిచేస్తున్న ఒక ఆర్టిస్ట్ రష్మీకి పెళ్లి అయిపోయిందంటూ ఒక ఆసక్తికర స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కామెడీ షోలో పలువురి టీమ్‌లో కమెడియన్‌గా చేసిన సతీష్ ఇటీవల సుధీర్, రష్మీల వ్యవహారం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
సుధీర్, రష్మీల జంటకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వారిద్దరు ప్రేమలో ఉన్నట్టు, పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేస్తున్నారు. కానీ వీరిద్దరు నిజ జీవితంలో పెద్దగా మాట్లాడుకోరు. షూటింగ్ అయిపోతే ఎవరి కారు ఎక్కి వారు వెళ్లిపోతారు. అలాంటి వారి మీద హైప్ క్రియేట్ అయినందుకు వారిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. నిజానికి సుధీర్‌కు పెళ్లైందా లేక రష్మీకి పెళ్లైందా లాంటి విషయాలు వారికి తెలీదు. టీవీలో చూపిస్తున్నదాన్ని నిజమని చాలామంది నమ్ముతున్నారు. అందరూ నమ్మినంత వరకు వాళ్లు కూడా అలాగే చేస్తుంటారు అని ఫైర్ అయ్యాడు సతీష్. అంతే కాకుండా సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరు అని రాసిస్తా అని సవాల్ చేసాడు.
RELATED STORIES
Karnataka : బీదర్‌లో ఘోరరోడ్డు ప్రమాదం.. చినారి సహా ఆరుగురు మృతి..
15 Aug 2022 4:35 PM GMTRajbhavan KCR : ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాని సీఎం కేసీఆర్.....
15 Aug 2022 4:23 PM GMTRevanth Reddy : అప్పటివరకు ఓపికపడితే కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్...
15 Aug 2022 3:20 PM GMTHyderabad : గన్‌ఫైరింగ్ చేసి స్టేటస్‌లో పెట్టిన టీఆర్ఎస్ నాయకులు..
15 Aug 2022 3:00 PM GMTKapra : కాప్రాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
15 Aug 2022 12:00 PM GMTBandi Sanjay : డీజీపీకి బండి సంజయ్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
15 Aug 2022 10:00 AM GMT