Nandamuri Balakrishna : బాలయ్య పై భలే రూమర్

Nandamuri Balakrishna :  బాలయ్య పై భలే రూమర్
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కోసం ఓ కీలకమైన సీన్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో అఖండ 2పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. తర్వాతి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోంది. ఈ టైమ్ లో బాలయ్యపై ఓ రూమర్ హల్చల్ చేస్తోంది.

2018లో రాజ్ తరుణ్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది మూవీకి త్వరలోనే సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సీక్వెల్ లో అప్పటి మెయిన్ లీడ్ అంతా కనిపించబోతోంది.ఫీమేల్ లీడ్స్ మారే అవకాశం చాలా ఉంది. ఫస్ట్ పార్ట్ లో ఎవరికీ సరైన పెయిర్ లేదు కాబట్టి ఫీమేల్ కాస్టింగ్ మార్చుకోవచ్చు. ఇవి కాక తాజాగా ఈ సీక్వెల్ లో నందమూరి బాలకృష్ణ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనేదే రూమర్.

ఈ నగరానికి ఏమైంది మూవీ మెయిన్ లీడ్ లో నటించిన విశ్వక్ సేన్ ఆ తర్వాత స్టార్ గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు బాలయ్యతో మంచి ర్యాపో ఏర్పడింది. అటు ఎన్టీఆర్ తో సైతం అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. బాలయ్యతో తనకు ఉన్న సాన్నిహిత్యం ద్వారా విశ్వక్ సేన్ ఆయన్ని ఈ ప్రాజెక్ట్ లో ఓ గెస్ట్ రోల్ లో నటించేందుకు ఒప్పించాడు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది రూమరే. నిజమైనా ఆశ్చర్యం లేదు. చూద్దాం.. మరి నిజంగానే బాలయ్య ఈ నగారానికి ఏమైంది2లో కనిపిస్తాడా లేదా అనేది.

Tags

Next Story