Allu Arjun : అల్లు అర్జున్ తో డబుల్ హ్యాట్రిక్ కు రెడీ

Allu Arjun :   అల్లు అర్జున్ తో డబుల్ హ్యాట్రిక్ కు రెడీ
X

కొన్ని కాంబినేషన్స్ ఆల్వేస్ స్పెషల్ అనిపించుకుంటాయి. ఇప్పుడు అలాంటి కాంబో టాలీవుడ్ లో ఏదైనా ఉంటే అది అల్లు అర్జున్, త్రివిక్రమ్ లదే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మూడూ ఒకదాన్ని మించి మరోకటి విజయం సాధించాయి. హిట్ రేంజ్ పక్కన పెడితే జులాయి మాత్రం ఇప్పటికీ చాలామందికి స్పెషల్ మూవీ. ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అల వైకుంఠపురములో తోనే అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ స్టార్ట్ అయింది.

ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు ఐకన్ స్టార్. డిసెంబర్ 6న విడుదల కాబోతోందీ మూవీ. మరి తర్వాతేంటీ అనే ప్రశ్న చాలామందిలో ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. కొన్నాళ్లుగా వినిపిస్తున్నదే అయినా ఎక్కడో డౌట్. అల్లు అర్జున్ నెక్ట్ అట్లీతో ఉంటుందని.. మరో దర్శకుడనీ పేర్లు వినిపించాయి. బట్ ఫైనల్ గా మళ్లీ త్రివిక్రమ్ తోనే సినిమా రాబోతోంది. ఈ విషయం బన్నీ వాస్ గతంలోనే చెప్పాడు. ఇప్పటి వరకూ ఈ ఇద్దరి సినిమాల్లో ఎప్పుడూ లేనంత బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ ఉంటుందని.. ఇంకా చెబితే పౌరాణిక నేపథ్యంలో వస్తుందని హింట్ కూడా ఇచ్చాడు. మన పౌరాణికాలపై త్రివిక్రమ్ కు గట్టి పట్టు ఉంది. వాటిని తనదైన శైలిలో చెబితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లోనే ఓ కొత్త థాట్ ను క్రియేట్ చేయగలడు. అంటే పురాణాల్లోని ఈ పాత్రలను ఇలా అర్థం చేసుకోవాలా అనిపించగలడు.

మొత్తంగా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఆ తర్వాత అంటే మాగ్జిమం ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిందట. సో.. ఈ మూవీతో వీళ్లు డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్నారు అనుకోవచ్చు.

Tags

Next Story