సినిమా

Bheemla Nayak update: డ్యూయట్ పాడనున్న భీమ్లా నాయక్..

Bheemla Nayak update: ఇతర భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడంలో టాలీవుడ్ కూడా బాగానే ఆసక్తి చూపిస్తోంది.

Bheemla Nayak update: డ్యూయట్ పాడనున్న భీమ్లా నాయక్..
X

Bheemla Nayak update: ఇతర భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడంలో టాలీవుడ్ కూడా బాగానే ఆసక్తి చూపిస్తోంది. అంతే కాకుండా ఈ రీమేక్‌లలో నటించడానికి స్టార్ హీరోలు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో హైప్‌ను క్రియేట్ చేసిన ఒక రీమేకే భీమ్లా నాయక్. మలయాళంలో అయ్యపనుమ్ కోషియుమ్ అనే సూపర్ డూపర్ మల్టీ స్టారర్‌కు ఇది రీమేక్. వకీల్ సాబ్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌తో మరో హిట్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

మలయాళంలో అయ్యపనుమ్ కోషియుమ్ సినిమాను ఇప్పటికే చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులు చూసేసారు. కానీ తెలుగులో ఇది పవన్ కళ్యాణ్, రానాల మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఇందులో నుండి విడుదలయిన క్యారెక్టర్ గ్లింప్స్‌లు, టైటిల్ సాంగ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా భీమ్లా నాయక్ నుండి మరొక అప్డేట్ బయటికొచ్చింది.

భీమ్లా నాయక్‌లో ఇద్దరు హీరోలకు జోడీలుగా ఇద్దరు హీరోయిన్లు ఉండగా పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుందన్న విషయం మాత్రమే అధికారికంగా వెల్లడైంది. ఈ సినిమాలో భార్యాభర్తలుగా నటించనున్న వీరిద్దరి మధ్య ఒక డ్యూయట్ కూడా ఉంది. ఆ డ్యూయట్‌ను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్టు సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. వారు ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పవన్, నిత్యాల పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది.


Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES