Sree Mukhi: లెటర్‌తో అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్.. ఆనందంలో రాములమ్మ..

Sree Mukhi: ఎవరైనా వ్యక్తి నచ్చితే వారి వివరాలు ఏంటి, ఇష్టాయిష్టాలు ఏంటి అని తెలియజేయడానికే టెక్నాలజీ ఉంది. అంతే కాక ఎవరైనా కొత్త వ్యక్తిని పరిచయం చేయాలన్నా, ఇష్టమైన వారితో తొలిసారి మాటకలపాలన్నా టెక్నాలజీ సాయం తీసుకోవాల్సిందే.. ప్రతీ పని టెక్నాలజీతో పూర్తవుతున్న ఈరోజుల్లో కూడా ఇంకా ప్రేమలేఖలు రాసేవారు ఉన్నారు. అవును నిజం!
మన అభిమాన నటీనటులకు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ, వారు పెట్టిన పోస్టులకు లైక్ కొడుతూ, కామెంట్ పెడుతూ మన అభిమానాన్ని తెలియజేస్తాం. అలాంటిది ఒక ఫ్యాన్ మాత్రం ఈ బుల్లితెర క్వీన్‌పై ఉన్న అభిమానాన్ని నాలుగు పేజీల లేఖలో తెలియజేసాడు. ఈ విషయాన్ని తానే తన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసింది.
శ్రీముఖి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై మకుటం లేని మహారాణులుగా వెలిగిపోతున్న యాంకర్‌లలో తను కూడా ఒకరు. ఇప్పటికే తన కామెడీ టైమింగ్‌తో, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది శ్రీముఖి. ఇదంతా తన సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే తెలిసిపోతుంది. అయితే వారందరికీ భిన్నంగా తన అభిమాని ఒకరు లేఖ ద్వారా తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసాడు. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఫామిలీతో పంచుకుంది.
'ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసే ఈ రోజుల్లో ఒక లెటర్ పోస్ట్‌లో రావడం, నాలుగు పేజీల్లో నా కెరీర్‌లో జరిగిన అన్ని విషయాలు రాయడం.. అది కూడా అచ్చ తెలుగులో. చదువుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీరెవరో తెలీదు కానీ మీకు మనస్పూర్తిగా థ్యాంక్యూ' అంటూ ఆ లెటర్‌ను ఫోటో తీసి షేర్ చేసింది. ఇంకా టెక్నాలజీని నమ్ముకోకుండా లేఖలను పంపించే అభిమానులను సంపాదించుకోవడం అదృష్టం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com