Prabhas's KALKI 2 : కల్కి 2 గురించిన అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి 2898 మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ కొత్త ప్రపంచం కోసం కలలు కంటోన్న ఒక తరంతో పాటు ఈ భూమ్మీదే మొదటి నగరమైన కాశీ కేంద్రంగా సాగే కథనంతో పాటు ఆకాశంలో ఓ కొత్త లోకంలోకి వెళ్లేందుకు ప్రయత్నించే వారి గురించి ప్రస్తావనం కనిపిస్తుంది. అలాగే ఈ మొత్తం కథకు మహా భారతాన్ని ముడిపెడుతూ, కర్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ పాత్రలతో ఓ అద్భుతమైన కంటెంట్ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దీనికి కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చినా కమర్షియల్ గా బాగానే వర్కవుట్ అయింది. అయితే కల్కికి రెండో భాగం కూడా ఉందని ముందే చెప్పారు. మరి ఆ సెకండ్ పార్ట్ ఎప్పుడూ అంటే దానికి చాలాకాలంగా ఎవరూ సమాధానం చెప్పడం లేదు.
తాజాగా నాగ్ అశ్విన్ ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యి పదేళ్లైన సందర్భంగా ఓ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్కి 2 గురించిన ప్రస్తావన వచ్చింది. దీనికి సమాధానంగా ఈ చిత్రం ఈ యేడాది చివర్లో ప్రారంభం అవుతుందని చెప్పాడు. ఈ సెకండ్ పార్ట్ అంతా ప్రధానంగా భైరవ, కర్ణ పాత్రలతోనే ఉంటుందని చెప్పాడు. మరి భైరవ పాత్ర 2898 కాలంలో సాగుతుంది. కర్ణ అనే మహా భారత కాలం నాటిది. ఈ రెండు పాత్రలనూ ఎలా ముడిపెడతాడు. దీనికి కమల్ హాసన్ క్యారెక్టర్ తో ఉండే లింకేంటీ అనేది సినిమాలోనే చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com