Ram Charan : రామ్ చరణ్ గ్లింప్స్ రెడీ అవుతోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. గత చిత్రం గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. అందకు ముందు వచ్చిన ఆచార్య సైతం ఆకట్టుకోలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లానింగ్ సరిగా లేదు అనే కమెంట్స్ కూడా వచ్చాయి. బట్ గేమ్ ఛేంజర్ మాత్రం ఎక్స్ పెక్టెడ్ ఫ్లాప్ అంటే కూడా తప్పేం లేదు. ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అలా ప్రిపేర్ అయ్యే ఉన్నారు. బట్ బుచ్చిబాబు నుంచి మాత్రం బ్లాక్ బస్టర్ వస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా చాలా పాజిటివ్ అంశాలే వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ చేసిన షూటింగ్ నుంచి సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా ఓ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ గ్లింప్స్ రెడీ చేశారట. దీనికి రెహమాన్ సంగీతం అందించాల్సి ఉంది. అతను మ్యూజిక్ ఇచ్చి ఉంటే ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఉండేవారని సమాచారం. ప్రస్తుతం రెహమాన్ ఆ పనిలో ఉన్నాడని చెబుతున్నారు.
మైత్రీ మూవీస్ బ్యానర్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మొత్తంగా త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్ రాబోతోంది. దీంతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com