Allu Arjun : అల్లు అర్జున్, రష్మిక మధ్య హాట్ సీన్.. ఆపై ట్విస్ట్

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఫస్ట్ పార్ట్ హిట్ కావడం.. ఆ నటనకు అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ రావడంతో పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. అయితే సెకండ్ పార్ట్ కు సంబంధించిన స్టోరీ ఎలా ఉండబోతోందా అని ఎవరికి వారు ఊహల్లో అంచనాలు వేస్తున్నారు. ఓ సాధారణ యువకుడు అసాధారణమైన రీతిలో ఎదగడం.. తండ్రి వారసత్వం కోసం తపించడం.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అప్పటి వరకూ అతను నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కదిలించేందుకు ఓ పోలీస్ రావడం.. అతనితో గిల్లికజ్జాలు పెట్టుకుని పెళ్లి పీటలు ఎక్కడం అనేది చూశాం.
ఇక సెకండ్ పార్ట్ కూడా పోలీస్ తో హోరాహోరీ అన్నట్టుగానే స్టార్ట్ అవుతుందట. ఎలాగైనా పుష్ప ను పట్టుకోవాలని ఆ యారోగెంట్ పోలీస్ ఆఫీసర్.. అతనికి దొరక్కుండా సరుకును దాటించే ప్రయత్నాల్లో పుష్ప.. ఇలా ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి స్క్రీన్ ప్లే సాగుతుందట. మరోవైపు డబ్బు తెచ్చిన అహంకారం కూడా పుష్పకు తోడవుతుందట. అయితే అతన్ని మార్చే సన్నివేశం ఇంటర్వెల్ బ్యాంగ్ గా ఉండబోతోందని టాక్.
ఇంటర్వెల్ కు ముందు అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య ఓ హాట్ హాట్ ఇంటిమేట్ సీన్ ఉంటుందట. ఇది ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో చూడలేదు అనే రేంజ్ హాట్ గా ఉంటుందని టాక్. ఫస్ట్ పార్ట్ లో రష్మిక, అల్లు అర్జున్ మధ్య కార్ లో ఓ సీన్ పెట్టాడు సుకుమార్. తీవ్రమైన విమర్శలు రావడంతో తీసేశారు. బట్ ఈ సారి బ్లాక్ బస్టర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కాబట్టి.. ‘అస్సలు తగ్గేదే లే’ అంటూ ఈ ఇంటిమేట్ సీన్ పెట్టారట. ఓ సాంగ్ తో పాటు కనిపించే ఈ సీన్ తర్వాత రష్మికను ఎవరో చంపేస్తారట. ఆమె మరణం నుంచి పుష్పలో మార్పు మొదలవుతుందంటున్నారు. అదే టైమ్ లో భార్య మరణానికి రివెంజ్ తీర్చుకోవడంలోనూ తనదైన శైలిలో వయొలెన్స్ మొదలుపెడతాడట. అప్పటి వరకూ తను సంపాదించిందంతా పేదలకు పంచుతూ.. ఫారెస్ట్ ఆఫీసర్ షెకావత్ నుంచి తప్పించుకుంటూ అడవుల్లోనే తలదాచుకుంటూ తన భార్య మరణానికి కారణమైన వారిని అంతం చేస్తుంటాడట.
ఈ పుష్ప 2 మొదలైనప్పుడు ఒక వీడియో విడుదల చేశారు కదా. అందులో అంతా పుష్ప ను దేవుడులా కొలుస్తుంటారు. అదంతా తను కొల్లగొట్టిన సంపదను పంచినందుకే అని.. ఆ పంచడం అనేది మరణం ముందు భార్య తీసుకున్ను మాట అనేది వినిపిస్తోంది.
మొత్తంగా ఇంటర్వెల్ కు ముందు రష్మికతో ఓ ఇంటిమేట్ సీన్.. తర్వాత తను చనిపోవడం అనేది ఫస్ట్ పార్ట్ లో హైలెట్ గా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది మరో నెల రోజుల్లోపే తేలిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com