Samantha Ruth Prabhu: 'నేను పెద్దయ్యాక సమంత అవుతా'.. చిన్నారి రిప్లైకు సామ్ ఫిదా..

Samantha Ruth Prabhu: సినీ సెలబ్రిటీలు ఎన్నో రకాలుగా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తారు. వారి ఆన్‌స్క్రీన్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ప్రవర్తన వల్ల కూడా ఎంతోమంది ఇన్‌స్పైర్ అవుతుంటారు. అలా వారికి ఎంతోమంది అభిమానులు కూడా అవుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంతను చూసి కూడా ఓ చిన్న పాప ఇన్‌స్పైర్ అయ్యింది. సామ్ గురించి ఆ పాప చెప్పిన ముద్దు ముద్దు మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆన్ స్క్రీన్ సమంత ఒక స్టార్.. మరి ఆఫ్ స్క్రీన్..? ఆఫ్ స్క్రీన్ కూడా తనలో ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసే గుణం ఉంది. తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోయే స్వభావం తనది. అందుకే ఓ మామూలు హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తను ప్రస్తుతం సీనియర్ స్టార్ స్థాయికి ఎదగడమే కాకుండా మిగతా వారితో పోటీపడుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
మామూలుగా చిన్నపిల్లలను నువ్వు ఏమవుతావ్ అని అడిగితే.. నేను డాక్టర్ అవుతా, నేను టీచర్ అవుతా అన్న సమాధానాలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఈ పాప మాత్రం నేను పెద్దయ్యాక సమంత అవుతా అంటోంది. అంతే కాకుండా తాను సమంతకు పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్తోంది. అయితే ఈ పాప వీడియోను స్వయంగా కీర్తి సురేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి సామ్‌ను ట్యాగ్ చేసింది.
'ఈ చిన్నారి మీకు డై హార్డ్ ఫ్యాన్.. మీరు ఆమెను ఒక్కసారైనా కలవాలి' అని చెప్తూ సామ్‌ను ట్యాగ్ చేసింది కీర్తి. దీనికి సమాధానంగా సమంత.. ఎవరీ క్యూటీ అని ఆ వీడియోను తన స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిన్నారి సమంత వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటూ.. వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com