Basil Joseph : కథలతో మాయ చేస్తోన్న మళయాల కుర్రాడు

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు అంటారు. అది అక్షరాలా నిజం అని నిరూపిస్తున్న కుర్రాడు బసిల్ జోసెఫ్. ఇతనెవరూ అనిపిస్తోంది కదూ. రెగ్యులర్ గా మళయాలం ఓటిటి మూవీస్ చూసేవారికి అతను బాగా తెలుసు. కాకపోతే పేరు చెబితే సడెన్ గా గుర్తుకు రాదేమో. అతను నటించిన సినిమాలు చెబితే మాత్రం.. బాబోయ్ అతనా.. ఆ కంటెంట్ ఏంటండీ బాబూ.. అతని స్టోరీ సెలక్షన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేస్తారు. నిజంగా అలాగే అనిపిస్తున్నాడీ కుర్రాడు. చాలా చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు బసిల్. ఇంజినీరింగ్ చదివి ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చినా వదిలేసి షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు అంటూ మాలీవుడ్ లో అడుగుపెట్టాడు. 2013లో నటుడుగా ప్రస్థానం మొదలైంది. చిన్నవో పెద్దవో వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోయాడు. అంతకు ముందు వినీత్ శ్రీనివాసన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ చేరాడు. దర్శకుడయ్యాక తన గురువునే హీరోగా పెట్టి కుంజిరామాయణం అనే మూవీతో ఆకట్టుకున్నాడు. టోవినో థామస్ హీరోగా రూపొందించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కామెడీ గోధా సూపర్ హిట్ అయింది. అప్పటికి టోవినో కెరీర్ లోనే హయ్యొస్ట్ వసూళ్లు సాధించిందీ మూవీ.
మరోవైపు నటనలో తన పాత్రల లెంగ్త్ పెరుగుతూ వచ్చింది. హీరోగానూ మారాడు. అప్పటి నుంచి కథాబలం ఉన్న సినిమాలే చేస్తున్నాడు. నిజానికి అతనిది హీరో పర్సనాలిటీ కాదు. అందగాడు కాదు. మంచి ఫిజిక్ లేదు. బట్ తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ లో అతనిలాంటి సగటు మనిషిలా కనిపించడం అలవాటు చేసుకున్నాడు. జయజయజయ జయహే అనే మూవీ నుంచి తెలుగు వారికి ఓటిటి ద్వారా బాగా తెలిసిపోయాడు. అయినా పేరుతో రిజిస్టర్ కాలేదు. పాత్రలతోనే పరిచయం అయ్యాడు. ఆపై ఈ మధ్య కాలంలో వచ్చిన నూనాకుళి, సూక్షదర్శిని, పోన్ మేన్ వంటి మూవీస్ తో ఓ రేంజ్ విజయాలు సాధించి ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తున్నాడు.
ఇక టోవినో థామస్ హీరోగా మళయలం నుంచి వచ్చిన ఫస్ట్ సూపర మేన్ మూవీ ‘మిన్నల్ మురళి’ దర్శకడు అతనే. కోవిడ్ టైమ్ లో నేరుగా ఓటిటిలోనే విడుదలైన ఈ చిత్రానికి అన్ని భాషల నుంచి అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు హీరోగా అతన్ని చూస్తున్న చాలామందికి ఈ చిత్ర దర్శకుడు అతనే తెలియదు. ప్రస్తుతం మారనమాస్ అనే మూవీతో రాబోతున్నాడు బసిల్ జోసెఫ్. అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ మూవీ పరాశక్తితో పరిచయం అవుతున్నాడు. మొత్తంగా కుర్రాడు కంటెంట్ తో దూసుకుపోతూ.. కలెక్షన్స్ ను ఎలా రాబట్టుకోవాలో అన్ని భాషల్లో ఉన్న తన ఏజ్ గ్రూప్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com