A Master Piece : హ్యాపీ సూపర్ ఇండిపెండెన్స్ డే అంటూ పోస్ట్ చేసిన మేకర్స్

A Master Piece : హ్యాపీ సూపర్ ఇండిపెండెన్స్ డే అంటూ పోస్ట్ చేసిన మేకర్స్
'ఏ మాస్టర్ పీస్' లోని హీరో ఫస్ట్ లుక్ ను మరోసారి షేర్ చేసిన మూవీ టీమ్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి భిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుకు పూర్వజ్ ప్రస్తుతం 'ఏ మాస్టర్ పీస్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. హ్యాపీ సూపర్ ఇండిపెండెన్స్ డే అంటూ అరవింద్ కృష్ణ లేటెస్ట్ లుక్ ను మేకర్స్ పరిచయం చేశారు.

ఇంతకుముందే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడుసార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 1960లో పుట్టి 1986లో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు అనేది ప్రశ్నార్థకంతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. వైవిధ్యమైన కథాంశం ఈ సినిమాలో ఉన్నట్లు విలన్ క్యారెక్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఏ మాస్టర్ పీస్ సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. దీని కంటే ముందు విడుదలైన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఏ మాస్టర్ పీస్ మూవీలో అరవింద్ కృష్ణ, అషు రెడ్డితో పాటు స్నేహ గుప్త, అర్చనా అనంత్, జ్యోతి రాయ్, జయప్రకాశ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా పోస్టు చేసిన పోస్టర్ ఇంతకుముందే మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే పోస్టర్ ను మరోసారి అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లుక్ లో టైటిల్‌ లోని ఏ అక్షరం ఎలాగైతే నిప్పులు చిమ్ముతూ వలయాకారంలో కనిపిస్తుందో.. ఆ శక్తి హీరోకూ ఉందనే అర్థం వచ్చేలా అతని కుడిచేతికి సైతం అదే కనిపిస్తోంది. అతని వెనక శివలింగంతో పాటు.. నెలవంక నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడి పరిణామక్రమం కూడా ఉంది. పోస్టర్‌ లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోన్న అంశం కూడా ఇదే. సింపుల్‌ గా కనిపిస్తున్నా చాలా పవర్‌ ఫుల్‌ పాత్రనే డిజైన్‌ చేసినట్టున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ హాలీవుడ్‌ రేంజ్‌ కంటెంట్‌ తో వస్తున్నారని అర్థం అవుతోంది. పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చేలా ఈ సూపర్‌ హీరో పాత్రను డిజైన్‌ చేశారు.




Tags

Read MoreRead Less
Next Story