Thandel : శివ పార్వతులుగా నాగ చైతన్య, సాయి పల్లవి తాండవం..

Thandel :   శివ పార్వతులుగా నాగ చైతన్య, సాయి పల్లవి తాండవం..
X

లవ్ స్టోరీలో బెస్ట్ కపుల్ గా కనిపించిన నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి జత కట్టింది. కార్తికేయ2తో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించిన చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తండేల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతోన్న సినిమా. శ్రీకాకుళం సముద్రం బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మిస్తోంది.

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కుతారు. వారిని ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ అనుకుని బంధిస్తుంది పాక్. వారిని విడిపించేందుకు భారత్ చాలా ప్రయత్నాలు చేసింది. నిజంగా జరిగిన ఈ సంఘటనలతోనే తండేల్ రూపొందుతోంది. దీనికి సినిమాటిక్ స్టైల్ లో దేశభక్తిని జోడించి కమర్షియల్ గా రూపొందిస్తున్నారు. సినిమా ఓపెనింగ్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియోతో నాగ చైతన్య మరో హిట్ కొట్టబోతున్నాడు అనేశారు.


ఇక తాజాగా ఈ మూవీ నుంచి కొన్ని కలర్ ఫుల్ స్టిల్స్ ను విడుదల చేశారు. శ్రీకాకుళం అనేది సంప్రదాయ జానపదాలకు పుట్టినిల్లు. అక్కడి జాలర్లు కూడా ఆ జానపదుల్లో భాగమే ఆ నేపథ్యంలో ఈ చిత్రంలో ఓ పాట ఉంటుందట. ఈ పాట సినిమాకే కాదు.. ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ స్పెషల్ గా నిలుస్తుందంటున్నారు. శివ పార్వతులు తాండవం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉందీ స్టిల్స్ చూస్తుంటే. ఆ బ్యాక్ డ్రాప్ కూడా అలాగే కనిపిస్తోంది. ఈ స్టిల్స్ తోనే ఇదో విజువల్ ఫీస్ట్ కాబోతోందని అర్థం అవుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం చేస్తోన్న ఈ మూవీ నుంచి ఈ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చూస్తుంటే చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్ మరోసారి ప్రూవ్ అయ్యేలా కనిపిస్తోంది కదా.



Tags

Next Story