వంటలక్కకి ఈ హీరోయిన్ కి ముడిపెట్టారుగా..!

వంటలక్కకి ఈ  హీరోయిన్ కి ముడిపెట్టారుగా..!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిత్రం.. కాగా తాజాగా సంక్రాంతి సందర్భంగా సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హీరోహీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అందరికీ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం దూసుకుపోతున్న ఈ టీజర్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇక ఈ టీజర్ పైన ఓ నెటిజన్ స్పందిస్తూ.. వంటలక్కకి, ఈ సినిమాకి ముడిపెడుతూ చాలా ఫన్నీగా కామెంట్ పెట్టాడు. అయితే ఆ కామెంట్ ని స్టార్ మా లైక్ కొట్టడం విశేషం.. అయితే దాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మన‌ స్టార్ మా ఈ కామెంట్‌ని లైక్ చేసిందని కామెంట్ పెట్టింది. దీనిపైన స్పందించిన స్టార్ మా.. అత‌డి కాన్ఫిడెన్స్‌, వంట‌ల‌క్క‌పై అత‌డికి ఉన్న ప్రేమ మాకు బాగా న‌చ్చింది. ఉప్పెన‌కు బెస్ట్ విషెస్ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఉప్పెన సినిమా విషయానికి వచ్చేసరికి రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం చేయ‌గా, దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story