Pawan Kalyan : ఇంతకీ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టా .. రానట్టా..?

Pawan Kalyan :  ఇంతకీ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టా .. రానట్టా..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా పూర్తిగా నమ్మడానికి లేకుండా పోతోంది. దీంతో ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ కూడా డైలమాలో పడుతున్నాయి. హరిహర వీరమల్లును ఈ మార్చి 28న విడుదల చేస్తాం అని ప్రకటించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పాడిన ఓ పాటను కూడా విడుదల చేశారు. దీంతో వీరమల్లు వస్తున్నాడు అనే అనుకున్నారు. మరి సడెన్ గా ఏమైందో.. ఆ డేట్ లో వేర్వేరు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. నితిన్ రాబిన్ హుడ్, సితార బ్యానర్ వారి మ్యాడ్ 2 మూవీస్ ను ప్రకటించారు. అంటే ఈ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ మూవీతో పోటీ పడేంత సత్తా లేదు. అయిన వస్తున్నారు అంటే ఖచ్చితంగా హరిహర వీరమల్లు రావడం లేదు అనే సమాచారం వీరి వద్ద పక్కాగా ఉండే ఉంటుందనుకోవచ్చు. బట్ తాజాగా చూస్తే మరోసారి ఆ డేట్ తో పోస్టర్ వేశాడు నిర్మాత ఏఎమ్ రత్నం.

రీసెంట్ గా హరిహర వీరమల్లులో ఔరంగజేబు పాత్రలో నటిస్తోన్న బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ గా మార్చి 28ని అలాగే ఉంచారు. దీంతో సినిమా వస్తుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కానీ సితార బ్యానర్ నాగవంశీ పవన్ తో సన్నిహితంగా ఉంటాడు అలాంటి తను ఏమీ తెలుసుకోకుండా ఆయన మూవీ టైమ్ కు తన సినిమా అనౌన్స్ చేయడు కదా. అలాగే రాబిన్ హుడ్ కు సంబంధించి మైత్రీ వాళ్లు. అయినా హరిహర నిర్మాతల కాన్ఫిడెన్స్ ఏంటో కానీ ఒకవేళ పవన్ మూవీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రాబ్లమ్ రాబిన్ హుడ్ కే ఉంటుందని చెప్పాలి. మరి ఈ మూవీ అసలు వస్తుందా లేదా అనే క్లారిటీ ఎవరిస్తారో కానీ.. అప్పటి వరకూ ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

Tags

Next Story