Allu Arjun : సంధ్య థియేటర్ కేస్ లో కొత్త ట్విస్ట్

Allu Arjun :  సంధ్య థియేటర్ కేస్ లో కొత్త ట్విస్ట్
X

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అప్పటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వెళ్లి.. ఆపై ఇండస్ట్రీ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లడం.. ఇప్పటికీ అల్లు అర్జున్ బెయిల్ పైనే ఉండటం.. దానికి సంబంధించి హియరింగ్స్ కోర్ట్ లో జరుగుతుండటం.. ఓ వైపు చూస్తున్నాం. అదే టైమ్ లో అల్లు అర్జున్ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా, తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా కొందరు మాట్లాడటం బాధ కలిగిస్తుందని.. పోలీస్ లను కార్నర్ చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్ మరింత వివాదంగా మారింది. ఈ విషయంలో పోలీస్ లు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి.. మరోసారి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఈ కేస్ లో ‘నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్’ కొత్త షాక్ ఇచ్చింది.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి పోలీస్ లు లాఠీ చార్జ్ చేయడమే కారణం అని నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు లాఠీచార్జ్ పై వివరణ ఇవ్వాలని తెలంగాణ డిజిపికి నోటీస్ లు జారీ చేసింది. నాలుగు వారాల వివరణతో కూడిని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమీషన్ కు పోలీస్ ల లాఠీచార్జ్ గురించి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్ఎహ్ఆర్సీ పోలీస్ లకు నోటీస్ లు జారీ చేసింది. మరి దీనిపై పోలీస్ ల వివరణ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story