Johny Master : ఆవిడకు చాలామందితో అక్రమ సంబంధాలున్నాయి

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేస్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై టీనేజ్ లో ఉన్నప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డాడని.. కొరియోగ్రాఫర్ గా అవకాశాలు ఇప్పిస్తానని పలుమార్లు అత్యాచారం చేయడమే కాక.. మతమార్పిడి చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని ఒత్తిడికి గురి చేశాడని ఆరోపిస్తూ.. ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ కేస్ విషయంలోనే జానీ మాస్టర్ ను పోలీస్ లు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయికి అనేకమందితో అక్రమ సంబంధాలున్నాయని చెబుతూ జానీ మాస్టర్ భార్య సుమలత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె చేసిన ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఏంటంటే..
‘కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ప్రేమ పేరుతో ట్రాప్ చేసింది. వేధింపులకూ గురి చేసింది. ఆయనతో పాటు ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. ఆమె వేధింపుల వల్ల నేను ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. తనకు పేరెంట్స్ తో పనిలేదని.. తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ పై ఒత్తిడి తేవడంతో పాటు అతన్ని మా ఇంటికి రాకుండా అడ్డుకునేది. ఒకవేళ జానీ మాస్టర్ ఇంటికి వచ్చినా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఇక్కడ ఉండాలని షరతులు పెట్టింది. ఈ వేధింపులు తట్టుకోలేక నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ‘మా ఆయన్ని నువ్వు ఇష్టపడితే నువ్వే పెళ్లి చేసుకో.. నేను ఆయన జీవితం నుంచి వెళ్లిపోతాను’.. అని కూడా చెప్పాను. కానీ ఆవిడ మాత్రం జానీ మాస్టర్ నాకు అన్నయ్య లాంటి వాడు.. మీరు నా ఒదిన అంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. నా భర్తతోనే కాక ఆ అమ్మాయికి చాలామంది మగవాళ్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇది తెలిసిన జానీ మాస్టర్ ఆమెను దూరం పెట్టాడు. ఆ కారణంగానే కక్ష కట్టి.. తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేస్ పెట్టింది. జానీ మాస్టర్ ను మాత్రమే కాదు.. కొందరు పేరు, డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది. ఈ వేధింపుల్లో ఆమె తల్లి పాత్ర కూడా ఉంది. నా భర్తపై ఆ అమ్మాయి పెట్టిన అక్రమ కేస్ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకూ, నా పిల్లలకు ఏం జరిగినా ఆ అమ్మాయితో పాటు ఆమె తల్లిదే బాధ్యత. దయచేసి నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను..’ అనేది ఆమె ఫిర్యాదులోని ముఖ్యాంశాలు. మరి ఈ కేస్ కు సంబంధించి చాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ.. ప్రస్తుతం సుమలత కంప్లైంట్ వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com