ఓ ఫోటో.. ఓ మధుర జ్ఞాపకం: అలియా భట్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గంగూబాయ్ కతియావాడిలోని తన నటనకు గాను తన తొలి జాతీయ అవార్డును అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి భర్త రణభీర్ కపూర్ తో కలిసి హాజరైంది. నటి, తన వివాహ చీరను ధరించి వేడుకకు హాజరై అతిధులను ఆకర్షించారు. అలియా భట్ అవార్డును అందుకుంటున్నప్పుడు, రణబీర్ కపూర్ తన ఫోన్‌లో ఆ అపురూపమైన క్షణాలను బంధించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో, ఆలియా రణబీర్‌తో కలిసి దిగిన హ్యాపీ సెల్ఫీని పోస్ట్ చేసింది. మరో ఫోటోలో, రణబీర్ కపూర్ ఆలియా పక్కన నిలబడి కలిసి నడుస్తూ కనిపించారు. ఈ ఫోటోకు క్యాప్షన్ రాస్తూ.."ఒక ఫోటో, ఒక క్షణం, జీవితానికి జ్ఞాపకం" అని ఆలియా భట్ పోస్ట్ చేసింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గంగూబాయి కతియావాడిలో అలియా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలియా భట్ రణబీర్ కపూర్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో వారి ఇంటిలో కొంతమంది కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఈ స్టార్ కపుల్ పెళ్లికి ముందు 5 సంవత్సరాలకు పైగా డేటింగ్ చేశారు. గత ఏడాది నవంబర్ 6 న మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. వారు ఆమెకు రాహా అని పేరు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com