Hathya Trailer : బాబాయ్ 'హత్య'పై సినిమా.. ట్రైలర్ ఎలా ఉందంటే

టాలీవుడ్ లో పొలిటికల్ మూవీస్ కు కొదవ లేదు. అయితే కొన్ని మూవీస్ మాత్రం ఆలోచింప చేస్తాయి. జరిగిన వాస్తవాలను జనాలకు తెలియజేసేలా ఉంటాయి. ప్రస్తుతం తెలుగులో రూపొందిన 'హత్య' అనే మూవీ ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఏపిలో జరిగిన ఓ సీనియర్ పొలిటీషియన్ హత్యను ప్రతిబింబించేలా కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తుంటే. నేరుగా పాత్రల పేర్లు చెప్పకపోయినా.. ఆ పాత్రలే గుర్తొచ్చేలా పెట్టిన పేర్లతో పాటు ప్రాంతాలు, మనుషుల బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఆ కథనే వెండితెరపై చెప్పబోతున్నారు అనేలా ఉంది.
ఒక ఇంట్లోని 'బాత్రూమ్'లో హత్య జరగడం, ఆ హత్యను మొదట ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం.. ఆపై పోలీస్ ల ఎంట్రీతో ఇది హత్యగా నిర్ధారణ కావడం.. అక్కడ ఉంచిన ఓ 'లెటర్' మాయం చేయడం, హత్య చేయబడిన వ్యక్తి కూతురు సిఎమ్ వద్దకు వెళ్లి తనకు ఫలానా 'వెంకటేష్ రెడ్డి'పై అనుమానం ఉందీ అంటే సిఎమ్.. తనకు ఆమె భర్తపైనే అనుమానం ఉందని చెప్పడం.. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడూ సజావుగా సాగకపోవడం.. ఇలాంటి సంఘటనల సమాహారంతో అచ్చంగా బాబాయ్ హత్య అనే కోణంలోనే ఈ మూవీ ట్రైలర్ కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిందితులను కాపాడే ప్రయత్నం చేసిన ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. చివరగా 'హు కిల్డ్ జేసీ ధర్మేందర్ రెడ్డి.. ఈజ్ ద బిగ్ క్వశ్చన్" అనే లైన్ బాగా ఆకట్టుకుంటోంది.
మొత్తంగా ఇప్పటి వరకూ వచ్చిన పొలిటికల్ మూవీస్ అంటే ఇది కాస్త స్ట్రాంగ్ గా ఉండబోతోంది అనిపిస్తోంది. ప్రధాన పాత్రల్లో ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రాం చంద్రన్, భరత్ రెడ్డి కనిపిస్తున్నారు. శ్రీవిద్య బసవ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మహాకాల్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. ప్రశాత్ రెడ్డి నిర్మించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com