Rebal Star Prabhas : కన్నప్ప నుంచి రెబల్ అప్డేట్

Rebal Star Prabhas :  కన్నప్ప నుంచి రెబల్ అప్డేట్
X

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా కన్నప్ప. భక్త కన్నప్ప కథను ఈ తరానికి అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనిచెబుతున్న విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కూడా. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న కన్నప్పలో భారీ కేమియోలు కూడా ఉన్నాయి. పరమశివుడు పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శివుడి వాహనమైన నందిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అని చెబుతున్నారు. అయితే అసలు ఈ మూవీలో ప్రభాస్ ఉంటాడా లేదా అనే డౌట్స్ కూడ అనేక మందిలో వినిపించాయి. బట్.. ప్రభాస్ కన్నప్పలో నటిస్తున్నాడు. అంతే కాదు.. అతనిపై ఓ పాట కూడా ఉంటుందని రీసెంట్ ఆ పాటను కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ స్వయంగా చెప్పడంతో పూర్తిగా కన్ఫార్మ్ అయింది.

ఇక లేటెస్ట్ గా ఓ రెబల్ అప్డేట్ ఇచ్చింది కన్నప్ప మూవీ టీమ్. ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారట. ఈ మేరకు వచ్చిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ లో క్రేజీగా మారింది. ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంటే ప్రభాస్ నుంచి ఈ యేడాది వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. రాజా సాబ్ టైమ్ కు రిలీజ్ అవుతూ ఉంటే.. అదే ముందయ్యేది. కానీ రాజా సాబ్ వాయిదా పడటం అభిమానుల్లో కొంత నిరుత్సాహం కలిగించింది. ఏదేమైనా తను నటించిన భక్త కన్నప్పలో మరోసారి ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని కృష్ణంరాజు తరచూ చెప్పేవారు. ఆయన కోరిక నెరవేరడం లేదు కానీ.. ఆ సినిమాలో మాత్రం ప్రభాస్ కనిపించబోతున్నాడు.

Tags

Next Story