Viswak Sen : లైలా సాంగ్.. రెడ్ హాట్ డ్రెస్ లో రెడ్డూ రోజమ్మో

Viswak Sen :  లైలా సాంగ్.. రెడ్ హాట్ డ్రెస్ లో రెడ్డూ రోజమ్మో
X

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లోనూ కనిపించబోతున్నాడు. ఓ మేకప్ ఆర్టిస్ట్ గా ఉండే తనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఆర్ట్ లో ఎక్స్ పర్ట్ అయిన అతను అనుకోకుండా లేడీగా మారతాడు అనే కంటెంట్ తో కనిపించిన టీజర్ చాలామందికి నచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో సాంగ్ విడుదలైంది.

‘హే రెడ్డు హాటు డ్రెస్సులోనా రెడ్డు రోజ్ అమ్మో.. హే రెడ్డూ సిగ్నల్ పడ్డట్టుగా ఆగానమ్మా.. నా రెండూ కళ్లూ చాలట్లేదు ఓ నా బుజ్జి మా.. నినూ హెడ్డుమీద పెట్టుకుంటా మా..’అంటూ మొదలైన ఈ గీతం పూర్తిగా రొమాంటిక్ సాంగ్ లా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ లోనే నీకు లాక్ అయిపోయానే.. లిప్ లాక్ పెట్టేశాక లింక్ అయిపోయానే అనే లైన్ ను బట్టి ఇది ఆ లిప్ లాక్ తర్వాత వచ్చే గీతంగా అర్థం చేసుకోవచ్చు. మాగ్జిమం పాటంతా హీరోయిన్ బికినీతోనే కనిపించేలా ఉంది.

ఈ పాటకు సంబంధించి స్టిల్స్ ను కూడా రీసెంట్ గా సోషల్ మీడియాను హెటెక్కించాయి. సినిమాలో కూడా అదే స్థాయిలో సెగలు రేపే పాటలా ఉంది. ఇక లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని ఈ పాటను పూర్ణాచారి రాయగా ఆదిత్య ఆర్కే, ఎమ్ఎమ్ మానసి ఆలపించారు.

Tags

Next Story