Bheemla Nayak: త్రివిక్రమ్ మ్యాజిక్.. 'భీమ్లా నాయక్'లోని ఆ సీన్‌కు రామాయణమే ఇన్‌స్పిరేషన్..?

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది 'భీమ్లా నాయక్'. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఉన్నాయి. మలయాళంలో హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ 'అయ్యపనుమ్ కోషియుమ్' చూసిన ప్రేక్షకులందరూ పవన్ కళ్యాణ్ కట్ ఔట్‌కు ఇది కరెక్ట్ సినిమా అని భావించడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు రైటర్‌గా చేసిన త్రివిక్రమ్.. ఇందులోని ఓ కీలక సన్నివేశాన్ని రామాయణం నుండి ఇన్‌స్పైర్ అయ్యి రాసినట్టు కొత్తగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రైటింగ్ స్టైల్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఒకప్పుడు రైటర్‌గానే తన కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్రమ్.. మెల్లగా డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. దర్శకుడిగా మారిన తర్వాత కూడా కొన్ని సినిమాలకు కథలను, డైలాగులను అందించాడు. మళ్లీ ఇన్నాళ్లకు తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం భీమ్లా నాయక్‌కు రైటర్‌గా మారాడు త్రివిక్రమ్.
భీమ్లా నాయక్.. ఓ పర్ఫెక్ట్ రివెంజ్ డ్రామా. ఇందులో పవన్ కళ్యాణ్, రానా పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. అయితే ఈ పాత్రల మధ్య సంభాషణలు కూడా అలాగే ఉండాలి. ఈ విషయంలో త్రివిక్రమ్ మరోసారి తనలోని మాటల మాంత్రికుడిని పూర్తిస్థాయిలో బయటపెట్టాడు. అంతే కాకుండా భీమ్లా నాయక్‌లోని ఓ కీలక సన్నివేశాన్ని ఏకంగా రామాయణం నుండే ఇన్‌స్పైర్ అయ్యి రాసినట్టుగా కనిపిస్తోంది.
రామాయణంలో వాలి, సుగ్రీవుల మధ్య జరుగే యుద్ధం గురించి పౌరాణికాలు చదివే ప్రతీ ఒక్కరికీ తెలుసు. వాలి, సుగ్రీవులు పేరుకే అన్నదమ్ములైనా వారి మధ్య జరిగే యుద్ధాల గురించి కూడా తెలిసే ఉంటుంది. అయితే వాలిని రాముడు చంపే ముందు కూడా సుగ్రీవుడితో యుద్ధానికి దిగుతాడు వాలి. ఆ సమయంలో వాలి తన కాలిని సుగ్రీవుడు భుజంపై పెట్టి తన చేయిని గట్టిగా పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తాడు.
అలా చేయడం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ ఆగిపోయి.. గుండెపోటు వచ్చి చనిపోతారు. అచ్చం భీమ్లా నాయక్ సినిమాలో కూడా రానా, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని ఇలాగే వివరించాడు త్రివిక్రమ్. పవన్.. రానా భుజంపై కాలు పెట్టి తనను చంపాలనుకునే సీన్ ఒకటి ఉంటుంది. అయితే రామాయణం గురించి స్పష్టంగా తెలిసిన వారికి ఈ సీన్‌ను అందులో నుండే తీసుకున్నారన్న విషయం అర్థమవుతోంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఆ ఉద్దేశ్యంతో దీనిని రాసాడో లేదో ఆయనే క్లారిటీ ఇవ్వాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com