The Warriorr: 'ది వారియర్' సినిమాలో ఒక్క పాటకే రూ.3 కోట్లు..
The Warriorr: చాక్లెట్ బాయ్ రామ్ గతకొంతకాలంగా రఫ్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన కెరీర్‌లో చాలావరకు ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీల్లోనే నటించిన రామ్.. ఇప్పుడు స్టోరీ సెలక్షన్ విషయంలో పూర్తిగా రూటు మార్చేశాడు. 'ఇస్మార్ట్ శంకర్'తో రూటు మార్చిన రామ్.. ఆ తర్వాత నటించిన 'రెడ్'లో కూడా మాస్ లుక్‌తోనే అలరించాడు. ఇక దీని తర్వాత 'ది వారియర్' అనే మరో కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
యంగ్ హీరో రామ్ మినిమమ్ గ్యారెంటీ హిట్లు కొట్టగలడు. తన సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఎంతోకొంత లాభాలను తెచ్చిపెట్టగలడు. కానీ ఇప్పుడు నిర్మాతలు రామ్ మార్కెట్ వాల్యూను మించి పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ది వారియర్ సినిమా కోసం నిర్మాత ఏ మాత్రం ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక్క పాట కోసమే రూ.3 కోట్లు కూడా ఖర్చయ్యిందట.
లింగుస్వామి దర్శకత్వంలో రామ్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రమే 'ది వారియర్'. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమాలోని బుల్లెట్ పాట లాంచ్ కోసం మూవీ టీమ్ చెన్నై వెళ్లింది. అక్కడే బుల్లెట్ పాట చిత్రీకరణ కోసం ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు అయిన విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు. మరి ఈ సినిమా నిర్మాతలకు ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com