Naga Chaitanya : తండేల్ నుంచి మరో బ్యూటీఫుల్ సాంగ్

Naga Chaitanya :  తండేల్ నుంచి మరో బ్యూటీఫుల్ సాంగ్
X

పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే అనే నమ్మకం సినిమా పరిశ్రమలో ఉంటుంది. నిజానికి ఒకప్పుడు పాటలే ఓపెనింగ్స్ తెచ్చాయి. ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్నాం కూడా పాటలతోనే తిరుగులేని ప్రమోషన్స్ అందుకుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే ఫీట్ తండేల్ కూ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.సూపర్ హిట్ జోడీ నాగ చైతన్య, సాయిపల్లవి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమైంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన బుజ్జితల్లి పాట యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది. చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ గా మారిపోయింది. ఇక తాజాగా వచ్చిన హైలెస్సో హైలెస్సో పాటతో మరోసారి అదరగొట్టాడు దేవీ శ్రీ ప్రసాద్. వినగానే ఆకట్టుకునే మెలోడీ ఇది. ప్రేమికుల మధ్య ఎడబాటు సందర్భంగా వచ్చే విరహ గీతం ఇది. మామూలుగా విరహ గీతాలు కాస్త శాడ్ గా ఉంటాయి. కానీ హైలెస్సో పాట చాలా అందంగా కనిపిస్తోంది. వింటున్నంత సేపూ సెలయేటిలో పడవ ప్రయాణంలా హాయిగా ఉందని చెప్పాలి.

'ఎంతెంత దూరాన్ని నువ్వు నేనూ మోస్తూ ఉన్నా అసలెంతా అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకూ నాకూ మధ్యన ఉన్నా కాస్తైనా అడ్డే కాదు.. ' అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీ మణి రాయగా నకాష్ అజీజ్, శ్రేయా ఘోషాల్ పాడారు. సింపుల్ ఇన్ స్ట్రుమెంట్స్ తో సాహిత్యం స్పష్టంగా వినిపించేలా చక్కని ట్యూన్ సమకూర్చాడు దేవీ శ్రీ ప్రసాద్. కథా నేపథ్యానికి తగ్గట్టుగా వచ్చిన హైలెస్సో హైలెస్సా అనే హుక్ లైన్ సైతం ఆకట్టుకుంటోంది. రెండు పాటలూ సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక మిగిలినవీ ఇదే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా తండేల్ కు మ్యూజిక్ బిగ్ ఎసెట్ అవుతుంది. ఏదైనా దేవీ శ్రీ ప్రసాద్ మనసు పెడితే ఇలాంటి మెలోడీస్ బాగా వస్తాయనేందుకు తండేల్ ఓ ఉదాహరణ.

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది తండేల్.

Tags

Next Story