Kanyakumari Song : కన్యాకుమారి నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

Kanyakumari Song :  కన్యాకుమారి నుంచి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్
X

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటిస్తున్న సినిమా "కన్యాకుమారి". రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై సృజన్ అట్టాడ స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఇది. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో పాటు సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కన్యా కుమారి నుంచి ఎద ఎద సవ్వడి అనే సాంగ్ ను విడుదల చేశారు.

కొన్ని పాటలు వినగానే ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని వింటూనే ఉండాలనిపిస్తుంది. ఈ రెండో కోవకు చెందినదే ఈ పాట. తను ప్రేమించిన అమ్మాయి ముందు బెట్టు చేసి తర్వాత ఒప్పుకుని తనతో కలిసి బైక్ పై ఒక రోజు షికారు చేయడానికి ఒప్పుకున్న సందర్భంగా తన ఆనందానికి రెక్కలు వచ్చినట్టుగా ఓ ప్రేమికుడు.. అతనితో పాటు ఆ అమ్మాయి మనసులోని భావాలను పాటలా మలిస్తే ఎలా ఉంటుందో అదే ఈ గీతం.

‘కదిలే కడలిపై ఎగిసే అలలతో మనసంతా ఊగిపోయొనే.. ’ అనే లైన్ అమ్మాయి మనో గీతంగా ఉంటే.. అన్నాళ్లు తనకోసం ఎదురు చూసిన ప్రియుడు ‘మోడు వారిన మొగ్గలా నిలిచి ఉన్నా చూడవా.. రంగు రంగు పువ్వులా పూసిపోవే నాపై ఇలా.. ఎండిపోయిన నేలలా.. ఉండిపోయా నేనిలా.. ఉరుముతున్న మేఘమై తడిపి పోవె జల్లులా.. ’ అందమైన కవిత్వం కూడా కనిపిస్తోందీ పాటలో. ఎద ఎద సవ్వడి చేసెను సందడి.. నువ్వు నన్ను తాకగా రేగెను అలజడి.. అంటూ ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ గా ఉందీ గీతం. మ్యూజిక్ కంపోజిషన్ ఇంకా హాయిగా అనిపించింది.

ఇక ఇప్పటికే ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. వాటిని మరింత పెంచేలా ఉన్న ఈ గీతాన్ని దర్శకుడు సృజనే రాయడం విశేషం. రవి నిడమర్తి సంగీతంలో అనురాగ్ కులకర్ణి, జయశ్రీ పల్లెం ఆలపించారు.

Tags

Next Story