Avika Gor : అగ్లీ స్టోరీ నుంచి సూపర్ ఎమోషనల్ మెలోడీ సాంగ్

Avika Gor :  అగ్లీ స్టోరీ నుంచి సూపర్ ఎమోషనల్ మెలోడీ సాంగ్
X

నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న మూవీ 'అగ్లీ స్టోరీ'. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'హే ప్రియతమా' అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇదో రొమాంటిక్ మెలోడీ సాంగ్. హార్ట్ టచింగ్ ఎమోషన్ తో వినగానే ఆకట్టుకునేలా ఉందీ పాట. టాలెంటెడ్ గా పేరున్న శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ ఈ పాటకి ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. కాల భైరవ సింగింగ్ స్టైల్, అతని వాయిస్‌లోని డెప్త్ ఈ సాంగ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. భాస్కరభట్ల రాసిన లిరిక్స్ సింపుల్‌గా ఉంటూనే లవ్‌లోని ఎమోషన్స్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాయి. "ప్రియతమా" అనే పదం చుట్టూ తిరిగే ఈ లిరిక్స్ యూత్‌కి ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. విజువల్స్‌లో శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నందు, అవికా గోర్ జోడీ మధ్య కెమిస్ట్రీ సాంగ్‌కి లైఫ్ ఇచ్చింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ రొమాంటిక్ మూడ్‌ని మరింత ఎన్‌హాన్స్ చేసింది. ఓవరాల్ గా చూస్తే "హే ప్రియతమా" ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్.

ప్రణవ స్వరూప్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. నందు, అవికా గోర్ తో పాటు శివాజీరాజా, రవితేజ మహాదాస్యం, ప్రజ్ఞ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అగ్లీ స్టోరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను త్వరలోనే చెప్పబోతన్నారు.

Tags

Next Story