Telusu Kada Movie : తెలుసు కదా నుంచి మల్లికగంధ సాంగ్

Telusu Kada Movie :  తెలుసు కదా నుంచి మల్లికగంధ సాంగ్
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మూవీ ‘తెలుసు కదా’. ఇప్పటి వరకూ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలుగా మారుతోంది. సిద్ధు సరసన రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీలా ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా తెలుసు కదా నుంచి థమన్ సంగీతంలో ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని సిధ్ శ్రీరామ్ పాడాడు. ‘ఆకాశం అందిందా నేలంతా నవ్విందా.. ఉన్నట్టుండి ఏదో మారిందా.. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా.. కన్నుల్లో నింపే వీలుందా..’ అంటూ సాగే ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటి వరకూ సిద్దును కాస్త ఫంకీ సాంగ్స్ లో ఎక్కువగా చూసి ఉండటం వల్ల ఇది కొత్తగా కనిపిస్తోంది. కాకపోతే సిధ్ శ్రీరామ్ వాయిస్ .. సిద్ధుకు సెట్ కాలేదేమో అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా అతను లిప్ సింక్ చేస్తున్న టైమ్ లో. ఇక ఈ పాటకు సంబంధించి మరో స్పెషాలిటీ థమన్ సంగీతం. తన ధోరణికి భిన్నంగా శాస్త్రీయత ఉట్టిపడే సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఆర్కెస్ట్రా కూడా సింపుల్ గా కనిపిస్తోంది. క్లాస్ సాంగ్ కు కావాల్సిన ఇన్స్ స్ట్రుమెంటేషన్ తో ఆకట్టుకున్నాడు. చాలా రోజుల తర్వాత సిధ్ వాయిస్ తో వచ్చిన పాట. అతను పాడితే హిట్ అనే సెంటిమెంట్ ఎలాగూ ఉంది కాబట్టి.. ఈ పాట కూడా అందరికీ ‘నచ్చేస్తుందీ’ అనుకోవచ్చు.

Tags

Next Story