Rajinikanth : కోలీవుడ్ లో వెయ్యి కోట్ల పంచాయితీ

క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశానికి వరల్డ్ కప్ రావడానికి దశాబ్దాలు పట్టింది. అలాగే సౌత్ ఇండియన్ సినిమా కేపిటల్ గా చెప్పుకునే కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకూ సాలిడ్ ప్యాన్ ఇండియా మూవీ రాలేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. కథల పరంగా టేకింగ్ పరంగా వాళ్లూ ఇతర భాషల దర్శకులకు తక్కువేం కాదు. మంచి నటులూ ఉన్నారు.పైగా అవార్డ్ ల విషయంలో మనకంటే ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ వెయ్యి కోట్ల సినిమా రాలేదు. ఇదే వారికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. రజినీకాంత్ లాంటి వెటరన్స్ సాలిడ్ బాక్సాఫీస్ విన్నర్స్ గా ఉన్నారు. అయినా వెయ్యి కోట్లు అనే మాట కలగానే మిగిలింది. పొన్నియన్ సెల్వన్ తో బాహుబలి రికార్డులు బద్ధలవుతాయి అన్నారు. బట్ ఆ మూవీ తమిళియన్స్ కు తప్ప మిగతా వారికి కనెక్ట్ కూడా కాలేదు. అయినా వారి చరిత్ర కాబట్టి హిట్ అనిపించుకుంది. బట్ బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాలేదు. మరి ఆ ఫీట్ ను సాధించే హీరో ఎవరు అనే చర్చల్లో ఆ మధ్య వచ్చిన సూర్య నటించిన కంగువ చిత్రాన్ని చెప్పుకున్నారు. అది కాస్తా యూనానిమస్ డిజాస్టర్ అనిపించుకుంది. కోలీవుడ్ వారికి కూడా నచ్చలేదు.
ఈ టైమ్ లో మరోసారి వెయ్యి కోట్ల హీరో అంటూ ప్రస్తుతం రజినీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన నటించిన కూలీ చిత్రం ఈ సారి కోలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు కొల్లగొట్టబోతోంది అనే పంచాయితీ నడుస్తోందక్కడ. కొందరు సాధ్యం అంటే.. మరికొందరు కష్టం అంటున్నారు. ఇంకొందరేమో.. అది కేవలం రజినీ అకౌంట్ లో వేయలేం.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. నాగార్జున, ఉపేంద్ర వంటి ఇతర భాషా హీరోలు కూడా ఉన్నారు కాబట్టి పూర్తిగా కోలీవుడ్ కే క్రెడిట్ ఇవ్వలేం అనే వాదనా సాగుతోంది. మరోవైపు కూలీ మిస్ అయినా జైలర్ 2 సాధిస్తుందంటున్నారు. జైలర్ 2 పరిస్థితి కూడా అంతే కదా.. ఇతర భాషా హీరోలు చాలామందే ఉన్నారు.
ఏదేమైనా కోలీవుడ్ ఈ విషయంలో చాలా చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి సినీ అభిమానులు. తెలుగు వాళ్లు ఎప్పుడో వెయ్యి దాటి రెండు వేల టార్గెట్ ను ఛేదించే పనిలో బాహుబలి 2, పుష్ప 2లతో అతి దగ్గరగా వెళ్లింది. చివరికి రీమేక్ లతో నడిచే కన్నడిగులు కూడా కేజీఎఫ్ రెండు భాగాలతో రెండు వేల కోట్లు సాధించారు. మిగిలింది మేమే కదా.. ఇంకెప్పుడు 1000 కోట్ల క్లబ్ లో చేరతామో అని తెగ ఫీలవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com