Naga Chaitanya : ఈ టైటిల్ కనెక్ట్ అవుతుందా చైతూ

ఏ సినిమాకైనా టైటిల్ చాలా ఇంపార్టెంట్. టైటిల్ అట్రాక్టివ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. కథకు సెట్ కాకపోయినా కంటెంట్ ను ఎలివేట్ చేయకపోయినా మంచి టైటిల్ ఉంటే ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉంటుంది. అందుకే సినిమా వాళ్లు నేములో ఏముంది లే అనుకోరు. ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు. అదే టైమ్ లో కథకు సరిపోతుందనుకుని కన్ఫ్యూజింగ్ టైటిల్స్ తో వచ్చినా సమస్య తప్పదు. టైటిల్ వల్ల కంటెంట్ అర్థం కాని సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మాస్ కు అర్థం కాకపోయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ అవుతుంది. మరి అక్కినేని నాగ చైతన్య నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే అని ఒక టైటిల్ వినిపిస్తోందిప్పుడు.
నాగ చైతన్య నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. తండేల్ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లోఓ సినిమా అనౌన్స్ అయింది. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ముందుగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తనకంటే శ్రీ లీల బావుంటుందని దర్శకుడు సుకుమార్ సూచించాడట. సుకుమార్ వద్ద కొన్నాళ్లు శిష్యరికం చేశాడు దర్శకుడు. అందుకే గురువు మాట విని మీనాక్షిని కాదని శ్రీ లీలను తీసుకున్నారు. కట్ చేస్తే శ్రీ లీల డేట్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయట. తను ఈ మధ్య వరుసగా మూడు నాలుగు సినిమాలు కమిట్ అయింది. పైగా బాలీవుడ్ లోనూ అడుగుపెడుతోంది. అందుకే చైతూ మూవీకి డేట్స్ ఇవ్వడం సాధ్యం కావడం లేదు అంటున్నారు. ఆ కారణంగా మళ్లీ మీనాక్షినే ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదలా ఉంచితే ఈ మూవీ టైటిల్ అంటూ ఓ టైటిల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది.
విరూపాక్ష లాగా ‘‘వృషకర్మ’’ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ కు అర్థం ఏంటీ అనేది బాగా చదువుకున్న వాళ్లకు కూడా సడెన్ గా తెలియదు. ఇక మాస్ కు కనెక్ట్ అవుతుందా.. పోనీ టైటిల్ తో సంబంధం లేకుండా ఆల్ క్లాస్ ఆడియన్స్ సోలోగా థియేటర్స్ కు రప్పించే సత్తా చైతన్యలో కానీ, ఈ దర్శకుడిలో కానీ ఉందా అంటే లేదు అనేకదా అందరికీ తెలిసింది. వృషకర్మ అనే టైటిల్ కథను ఎంత గొప్పగా జడ్జ్ చేసినా.. ఆడియన్స్ లోకి వెళ్లడం కష్టం అవుతుంది. నిజానికి ఆడియన్స్ లేదా ఇండస్ట్రీ ఏం అనుకుంటుందో తెలుసుకోవడానికి కూడా ఇలాంటి టైటిల్ పెట్టబోతున్నాం అని చూచాయగా లీక్ చేశారు అనే మాటలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ టైటిల్ అయితే పలకడానికే కాదు.. గుర్తుపెట్టుకోవడానికీ కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com