Janhvi Kapoor : జాన్వీ కపూర్ కి ఘోర అవమానం

Janhvi Kapoor :  జాన్వీ కపూర్ కి ఘోర అవమానం
X

శ్రీదేవి అంటే తెలియని ఇండియన్ ఆడియన్స్ ఉండరు. ముఖ్యంగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఆమెను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. శ్రీదేవి అకాల మరణం కోట్లమందిని బాధపెట్టింది. తను బ్రతికి ఉండగానే కూతురు జాన్వీ కపూర్ ను సౌత్ లో హీరోయిన్ గా పరిచయం చేసి తన లెగసీని కంటిన్యూ చేయించాలనుకుంది. ఆ కోరిక నెరవేరకుండానే శ్రీదేవి కన్నుమూసింది. తను ఉన్నప్పుడే తెలుగులో రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ తో ఇంటర్డ్యూస్ చేయించే ప్రయత్నాలు జరిగాయి అంటారు. బట్ తను లేకపోయినా.. ఎన్టీఆర్ దేవర మూవీతో దక్షిణాది సినిమాకు పరిచయం అయింది. బట్ ఈ మూవీలో తనను చూసిన వాళ్లంతా అయ్యో పాపం అనుకుంటున్నారు.

దేవరలో జాన్వీ పాత్ర పట్టుమని 20 నిమిషాలు కూడా లేదు. అది కూడా వ్యాంప్ తరహా కాస్ట్యూమ్స్ తో అస్సలే మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో కనిపిస్తుంది. కేవలం ఒక పాటలో స్కిన్ షో చేయడానికి మాత్రమే తనను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి.. ఇంత పేలవమైన పాత్రతో ఒక పెద్ద ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ తనేనేమో..

మరి ఈ సినిమాలో తన పాత్ర అలాగే ఉంటుందని చెప్పి ఒప్పించారా లేక ఎడిటింగ్ లో లేపేశారా అన్నది తెలియదు కానీ.. మొన్నటి వరకూ రోలింగ్ టైటిల్స్ లో పడుతుందీ అనుకున్న దావూదీ సాంగ్ సైతం అసలే లేదు. దీంతో ఈ మూవీపై ఎంతో ఆశ పెట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడాలని ప్రిపేర్ కూడా అయిన జాన్వీకి ఇది ఓ రకంగా అవమానమే అని చెప్పాలి. మరి అందుకు కారణం ఎవరనేది చూడాలి.

Tags

Next Story