Ram Charan : రామ్ చరణ్ కు విలన్ గా సూపర్ స్టార్

ఏ కమర్షియల్ మాస్ మూవీలో అయినా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. మాస్ ఆడియన్స్ లో రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. దానర్థం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అఫ్ కోర్స్ బలమైన కథ, కథనాలు చాలా ఇంపార్టెంట్ అనుకోండి. కానీ కొన్నిసార్లు ఈ రెండూ వీక్ గా ఉన్నా.. ఆర్టిస్టులు టాప్ లేపితే ఆకట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇక పుష్ప 2 తో కంట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సుకుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడు. అది రామ్ చరణ్ తోనే అని ఆల్రెడీ అనౌన్స్ అయింది కదా. ఈ మూవీలోనే విలన్ గా ఓ టాప్ సూపర్ స్టార్ ను తీసుకుంటున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఆయన ఓకే చెప్పాడు అని కూడా అంటున్నారు.
మరి ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా.. షారుఖ్ ఖాన్. సర్ ప్రైజ్ అయ్యారు కదా. బట్ ఇది నిజం అంటోంది బాలీవుడ్ మీడియా కూడా. కొన్నాళ్ల క్రితమే సుకుమార్.. బాలీవుడ్ బాద్ షాను అప్రోచ్ అయ్యాడట. అప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో షారుఖ్ హీరోగా సినిమా వస్తుందేమో అని వార్తలు వచ్చాయి. బట్ షారుఖ్ హీరో కాదు.. విలన్. అదీ రామ్ చరణ్ కు. ఊహించుకుంటుంటేనే ఓ రేంజ్ లో అనిపిస్తోంది కదా ఈ కాంబినేషన్.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ తో చేస్తోన్న ఈ మూవీ కూడా కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోంది. ఈ కథలో కులంతో పాటు సామాజిక అసమానతలను గురించి చర్చించబోతున్నాడట సుకుమార్. రంగస్థలంలో జగపతిబాబులాగా కాకుండా ఈ సారి విలన్ దేశీ లుక్ లో కాస్త భయంకరంగా ఉండాలని చెప్పాడట సుక్కూ. ఆ మేరకు ఎలాంటి మేకోర్ కు అయినా రెడీ అని చెప్పాట్ట షారుఖ్. మొత్తంగా సౌత్ కంటే హిందీ మీడియాలోనే ఈ వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అప్పుడే చెప్పలే కానీ నిజమే అయితే ఇండియన్ బాక్సాఫీస్ బద్ధలైపోవడం ఖాయం అనే చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com