Aa Ammai Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి చెప్పేశాడు...!
Aa Ammai Gurinchi Meeku Cheppali : దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో సుధీర్ బాబులది మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్... వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'... మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా, కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కొద్దిసేపటి క్రితం సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో సుధీర్ బాబు ఫిలిం మేకర్ గా కనిపించనున్నారు. డాక్టర్ అలేఖ్యగా హీరోయిన్ కృతిశెట్టి కనిపిస్తోంది. సినిమాలంటే ఇష్టం ఉన్న హీరోకి, అసలు సినిమాలే చూడని అమ్మాయితో ఓ సినిమాని ఎలా తీశాడు? ఆమెతో ఎలా ప్రేమలో పడ్డాడు అన్నది మెయిన్ కథగా తెలుస్తోంది. సినిమా టీజర్ చివర్లో తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
వివేక్ సాగర్ నేపధ్య సంగీతం అలరించింది. మొత్తానికి సినిమా పైన అంచనాలను పెంచేశాడు ఇంద్రగంటి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com