AAGMC : 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ ట్రైలర్ రిలీజ్..

AAGMC : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్ రిలీజ్..
X
AAGMC : సుధీర్ బాబు, కృతి శెట్టి కలిసి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది

AAGMC : సుధీర్ బాబు, కృతి శెట్టి కలిసి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రిన్స్ మహేశ్ బాబు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొటీన్‌కు లవ్‌స్టోరీకి కొంత భిన్నంగా ట్రైలర్ సాగింది. ఇందులో డాక్టర్‌గా కృతి శెట్టి, డైరెక్టర్‌గా సుధీర్ బాబు కనిపిస్తారు. కథానాయకుడి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేస్తుంది అనే మెయిన్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు.

ట్రైలర్‌లో హీరో ఓ ప్రమాదానికి గురౌతాడు.. ఆ తరువాత ఏమవుతుంది. అసలు వీరిద్దరి ప్రేమ సక్సస్ అవుతుందా.. అబ్బాయి జీవితాన్ని అమ్మాయి ఎలా మార్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ నెల 16వ తేదీన సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే.

Tags

Next Story