AA22xA6 : డూన్ లొకేషన్స్ లో అల్లు అర్జున్ మూవీ షూటింగ్..

కొన్ని కథలకు లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ లొకేషన్స్ కూడా కథలో భాగంగా కనిపిస్తాయి. చాలా వరకూ హాలీవుడ్ మూవీస్ లో ఇది అర్థం అవుతుంటుంది. ఇప్పుడిప్పుడే ఇండియన్ మూవీస్ లో లొకేషన్స్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీస్ కు సంబంధించి. అందుకే డూన్ -2 అనే హాలీవుడ్ మూవీ రూపొందించిన ఎడారిలో అల్లు అర్జున్ సినిమా చిత్రీకరణ జరుపుకోబోతోంది. గతేడాది విడుదలైన డూన్ 2 వాల్డ్ వైడ్ గా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని ఎడారి సీన్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ సీన్స్ ను యూఏఈలోని అబుదాబి వద్ద గల లివా ఒయాసిస్ ప్రాంతంతో పాటు జోర్డాన్ వద్ద ఉన్న వాడి రమ్ అనే ప్రాంతంలో చిత్రీకరించారు. జోర్డాన్ వద్ద రెడ్ శాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతోన్న మూవీని షూట్ చేయబోతున్నారు.
ప్రస్తుతం అల్లు - అట్లీ మూవీ షూటింగ్ కోసం ఆ ప్రాంతాల్లో లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నారు. అంటే అచ్చంగా డూన్ మూవీ ప్రాంతాలే ఉంటే కాపీ అంటారు కదా. అదీ కాక వీరి కథకు తగ్గట్టుగా ఆ ఎడారి కనిపించాలి. అందుకే తమ కథకు అనుగుణమైన ప్రదేశాలను వెదుకుతోంది ఒక టీమ్. ఇక ఈ మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీతో పాటు ఇంతకు ముందెప్పుడూ చూడనంత విజువల్ గ్రాండీయర్ తో పాటు యాక్షన్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతోందని ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు. సింపుల్ గా సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందబోతోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు దీపికా పదుకోణ్ నటించబోతోంది. తనకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోనే ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో ఊహలకే వదిలేయాలి. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని చెబుతున్నారు. ఇతర పాత్రల్లో ఎవరు నటించబోతున్నారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కొందరు హాలీవుడ్ ఆర్టిస్టులు ఉంటారనే న్యూస్ కూడా ఉంది. ఈ మూవీకి సాయి అభయంకర్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పుడిప్పుడే ఇతను కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారుతున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com