Aadavallu Meku Joharlu : 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Aadavallu Meku Joharlu : యంగ్ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ ''ఆడవాళ్ళు మీకు జోహార్లు''.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్చెరుకూరి నిర్మిస్తున్నారు. ఒక్క పాట తప్ప మిగిలిన షూటింగ్ అంతా అయిపొయింది. ఇదిలా ఉంటే మేకర్స్ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు.
#AadavalluMeekuJohaarlu Releasing in Theaters on February 25 💥💥#AMJOnFEB25
— Sharwanand (@ImSharwanand) January 28, 2022
@iamRashmika @DirKishoreOffl @realradikaa @khushsundar #Urvashi @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl pic.twitter.com/Z8I7ssvapf
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com